Breaking News

Daily Archives: April 29, 2020

ఐదుగురు డిశ్చార్జ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఐదుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ చేయబడ్డారని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీరితో కలిపి జిల్లాలో మొత్తం 41 మంది డిశ్చార్జి చేయబడ్డారని మరో 20 మంది కోలుకోవాల్సి ఉందని కలెక్టర్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Read More »

ఆరోగ్య కార్యక్రమాల‌లో వందశాతం ప్రగతి సాధించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరు శరత్‌ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశాన్ని టెలికాన్ఫరెన్సు ద్వారా నిర్వహించారు. జిల్లాలోని వైద్యాధికారులందరితో పలు అంశాల‌పై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల‌ నమోదు, పిల్ల‌ల‌కు వ్యాధి నిరోధక టీకాల‌ విషయంలో తక్కువ ల‌క్ష్యాల‌ను సాధించిన వైద్యాధికారుల‌ను ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు వుంటాయని అన్నారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల‌లో జిల్లా 100 శాతం ప్రగతి సాధించాల‌ని, దీని కొరకు అందరూ నిబద్దతతో పని చేయాల‌ని సూచించారు.

Read More »

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధంగా చూడాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని పిహెచ్‌సి, సిహెచ్‌సి కేంద్రాల్లో 100 శాతం ప్రసవాలు అయ్యేవిధంగా వైద్యులు చూడాల‌ని కోరారు. ఆరోగ్య ఉప కేంద్రాల‌ పరిధిలో గర్భవతుల‌ నమోదు చేయాల‌న్నారు. ఆరోగ్య కార్యకర్త పనితీరు వారం రోజుల‌కు ఒకసారి సమీక్ష చేయాల‌ని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, జిల్లా వైద్యాధికారి ...

Read More »

రైతు పొలాల‌ వద్దకెళ్ళి ధాన్యం కొనుగోలు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. దోమకొండ మండలం లింగుపల్లి, ముత్యంపేట, దోమకొండ, కామారెడ్డి మండలం క్యాసంపల్లి కొనుగోలు కేంద్రాల‌ను పరిశీలించారు. 17 తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తాలు లేకుండా చూడాల‌ని కోరారు. రోడ్డు పక్కన ఉన్న రైతు పొలాల‌ వద్దకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాల‌ను ఎప్పటికప్పుడు ...

Read More »

సోడియం హైడ్రోప్లోరైడ్‌ ద్రావణం పిచికారి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో సోడియం హైడ్రోప్లోరైడ్‌ పిచికారి చేశారు. కరోనా వైరస్‌ తరిమి వేయాల‌నే ఉద్దేశ్యంతో బుధవారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ గారి ఆదేశాల‌ మేరకు 47వ వార్డు కౌన్సిర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో రెండవసారి సోడియం, హైడ్రోప్లోరైడ్‌ పిచికారి చేశారు. కావున వార్డు, పట్టణ ప్రజలు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించి స్వీయ గృహ నిర్బంధంలో ఉండి ...

Read More »

‘కరోనాపై కవితాస్త్రం’ పుస్తకావిష్కరణ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల‌ వేదిక కామారెడ్డి ఆధ్వర్యంలో కవులు రాసిన ‘కరోనాపై కవితాస్త్రం’ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ బుధవారం ఆవిష్కరించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సిరిసిల్లా గఫూర్‌ శిక్షక్‌ సంపాదకత్వంలో ఇందులో కరోనాపై చైతన్యం తెచ్చేవిధంగా 36 మంది కవులు రాసిన కవితలున్నాయని పేర్కొన్నారు. తెరవే పిలుపునందుకొని కవితలు పంపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కవులు బాధ్యతగా తమ తమ కవితల‌తో పుస్తకాన్ని ప్రచురించడం అభినందనీయమన్నారు. ఎంతోమంది కవులు, ...

Read More »

అనాధ పిల్ల‌ల‌కు నెల‌కు సరిపడా నిత్యవసరాల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ కారణంగా వసతి గృహాల్లోని విద్యార్థులు తమ తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కానీ మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలోని చిల్డ‌డన్‌ హోంలో తమకు ఎటువంటి కుటుంబంలేని ఐదుగురు అనాథలు అక్కడే ఉండిపోయారు. వీరి నిర్వహణ ఇబ్బంది అవుతోందని నిర్వహకులు జిల్లా అదికారుల‌ను కోరితే వారిచ్ఛిన సమాచారం మేరకు రంజిత్‌ మోహన్ నెల‌సరి నిత్యవసరాలు బుధవారం పంపిణీ చేశారు. ఇందుకు కళ్యాణ్‌, శ్రీను సహకరించారు, వారికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

మానవ జీవితానికి పరమార్ధం సేవయే

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కేంద్రానికి చెందిన వనిత (32) అనే మహిళకు గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం ఎల్లారెడ్డి కేంద్రంలోని వెంకటేశ్వర వైద్యశాల‌లో అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. వారు పట్టణానికి చెందిన బిజెపి జిల్లా నాయకుడు విశ్వనాధుల‌ మహేష్‌ గుప్తా సహాయంతో ఓ పాజిటివ్‌ రక్తం వీ టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు ...

Read More »

ఆపన్నుల‌ను ఆదుకోవడంలో జాగృతి ముందుంటుంది

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి నాయకులు నరాల‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నిత్యావసర సరుకుల‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్‌ పాల్గొని దాదాపు 40 నిరుపేద కుటుంబాల‌కు అందజేశారు. ఈ సందర్భంగా అవంతి కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆపత్కాలంలో ఎప్పుడూ ముందుండి ఆపన్నుల‌ను ఆదుకుంటుందన్నారు. మన నగరంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ అవసరమొచ్చినా తెలంగాణ జాగృతి ...

Read More »