Breaking News

Daily Archives: May 1, 2020

19 రోజులుగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు లేవు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల‌ వద్ద కూలీలు సామాజిక దూరం పాటించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల‌ స్థాయి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక దూరం పాటించని వ్యక్తుల‌కు జరిమానాలు విధించాల‌ని, బియ్యం పంపిణీ కేంద్రాల‌ వద్ద, వ్యాపార సంస్థల‌ వద్ద ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం నిబంధనల‌ను పాటించాల‌ని పేర్కొన్నారు. గత 19 రోజులుగా జిల్లాలో ...

Read More »

పిల్ల‌ల‌ వైద్యుల‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రొటెక్షన్‌ కిట్ల పంపిణీ

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి చి్డన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం 100 ప్రొటెక్షన్‌ కిట్లు 2 వేల‌ గ్లౌజులు, తొమ్మిది వందల‌ మాస్కులు, 1200 శానిటిజర్లును కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌కు అందజేశారు. వీటిని కలెక్టర్‌ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌కు ఇచ్చారు. చి్డన్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వారు ల‌క్ష రూపాయల విలువైన వస్తువుల‌ను వితరణ చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకట రాజం, కార్యదర్శి నాగేందర్‌, కోశాధికారి డాక్టర్‌ సంగీత్‌ కుమార్‌ ...

Read More »

పోరాటాల‌ ద్వారానే హక్కులు సాధ్యం

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హక్కుల‌ను సాధించాలంటే పోరాటాల‌ ద్వారానే సాధ్యం అవుతాయని చికాగో కార్మికులు నిరూపించారని, కార్మిక అమరుల‌ స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాల‌ను సాధించుకున్నామని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్‌, పెద్దులు అన్నారు. మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో శుక్రవారం ప్రపంచ కార్మికుల‌ దినం మేడే పురస్కరించుకుని కార్మికుల‌ జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సమసమాజం ఏర్పడాలంటే సోషలిస్టు వ్యవస్థ మార్గమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల‌ను ...

Read More »

మెప్మా ఆధ్వర్యంలో 3800 మాస్కులు విక్రయించారు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పాత బస్టాండ్‌లో మెప్మా ఆధ్వర్యంలో శక్తి బజార్‌లో మాస్కుల‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శరత్‌ కొనుగోలు చేశారు. ఇప్పటికీ 3800 మాస్కులు విక్రయించినట్లు మహిళలు తెలిపారు. మాస్క్‌ల‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాల‌ని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ శైల‌జ, ఆర్‌డిఓ రాజేందర్‌ పాల్గొన్నారు.

Read More »

రైతుల‌కు ఇబ్బందులు కల‌గ‌కుండా చూడాలి

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలులో రైతుల‌కు ఎటువంటి ఇబ్బందులు కల‌గకుండా చర్యలు చేపట్టాల‌ని బోధన్‌ ఆర్‌డిఓ గోపి రామ్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి, రెంజల్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయన పరిశీలించారు. వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి, రైతుల‌కు గన్ని సంచుల‌ను ఇచ్చి, వెంటనే తూకం వేయాల‌ని ఆయన సూచించారు. రైస్‌ మిల్‌లో కడతా చేపట్టినట్లయితే అధికారుల‌ దృష్టికి తీసుకు వచ్చి రైతుల‌కు లాభం అయ్యే విధంగా ...

Read More »

జర్నలిస్టుల‌కు నిత్యవసర కిట్ల పంపిణీ

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హల్‌లో సుమారు 28 మంది జర్నలిస్టుల‌కు వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ బిబిపాటిల్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని కరోనా అతలాకుతం చేస్తుందని, వైరస్‌ ప్రభావం పెరగకుండా సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మరణాల‌ సంఖ్య ఎక్కువ ఉందని, ...

Read More »

మే 30 లోపు రుణ ల‌క్ష్యాలు సాధించాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుణాల ల‌క్ష్యాల‌ను మే 30లోగా సాధించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. ఐకెపి అధికారుల‌తో కలెక్టరేట్‌ జనహితలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్ నెల ల‌క్ష్యాన్ని మే 15 లోగా పూర్తి చేయాల‌న్నారు. మే నెల ల‌క్ష్యాన్ని మే 30వ తేదీ లోపు పూర్తిచేయాల‌ని సూచించారు. రుణాల ల‌క్ష్యాలు పూర్తి చేయని అధికారుల‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ నెల‌లో రుణాల ల‌క్ష్యాల‌ను పూర్తి ...

Read More »

మాచారెడ్డిలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

మాచారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాచారెడ్డి మండల ప్రజల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపీ బిబి పటేల్‌, మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు (సురేష్‌), మాచారెడ్డి మండల‌ జడ్పిటిసి మినుకూరి రామ్‌ రెడ్డి, మాచారెడ్డి మండల‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అలాగే మాచారెడ్డి మండల‌ టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

ఆటో యజమానుల‌కు వంట సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటో యజమానుల‌కు ఆర్థిక, వంటసరుకుల‌ను ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ శుక్రవారం అందజేశారు. రామారెడ్డి మండల‌ కేంద్రంతో పాటు ఉప్పల్‌వాయి గ్రామాల్లో వివిధ గ్రామాల‌కు చెందిన ఆటో యూనియన్‌ యజమానుల‌కు ఒక్కోక్కరికీ 5 వందల‌ నగదు, వంటసరుకుల‌ కిట్లను అంధజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆటో యజమానులు 2 వేల‌ పైచిలుకు ఉన్నారని, వారందరికి విడతల‌ వారిగా వంటసరుకులు, ఆర్థిక సహయం అందిస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు, విలేకరులు తమ ...

Read More »

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కోనాఫూర్‌ గ్రామంలో రెడ్‌ క్రాస్‌ సొసైటి జిల్లా కోశాధికారి అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, ఐసిడీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ చేతుల‌ మీదుగా 300 మంది ఉపాధి హామీ కూలీల‌కు మాస్క్‌లు పంపిణి చేశారు. కరోనా నివారణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దుర్గవ్వ, ఎంపీటీసీ రవి, యాడరం సర్పంచ్‌ వెంకట్‌ రావు, మాజీ ...

Read More »

నిజాంసాగర్‌ ఏపివోగా మల్లేశ్‌

నిజాంసాగర్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలానికి నూతన ఏపివోగా మ‌ల్లేష్ బాధ్యతలు స్వీకరించారు. నిజాంసాగర్‌లో పని చేస్తున్న ఏపీఓ సుదర్శన్‌ బాన్సువాడ కు బదిలీపై వెళ్ళారు. ఈ సందర్బంగా ఏపీవో మల్లేష్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల గురించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వేసవి కాలంలో ఏర్పాటు చేసే అంబలి కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. గత 16 సంవత్సరాలుగా ప్రతీ వేసవి కాలంలో ఇక్కడ అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం మాట్లాడుతూ పేద ప్రజల‌ సేద తీర్చేందుకు ప్రతీ సంవత్సరం అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు జంగం నీకంఠం, బుంగారి రాము, ఎరుక సాయిు, పార్టీ నాయకులు ...

Read More »

కామారెడ్డిలో ఘనంగా మేడే ఉత్సవాలు

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ కార్మిక దినోత్సవం 134వ మేడే సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంసిపిఐయు జిల్లా కార్యాల‌యం ముందు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర కమిటీ సభ్యుడు జబ్బర్‌ నాయక్‌, ఎస్‌సిటియు జిల్లా కార్యదర్శి మెట్టు సాయిరాం, బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొల్లూరు ప్రభాకర్‌తోపాటు పెయింటర్స్‌ యూనియన్‌ మోహన్‌, ఎల‌క్ట్రికల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఖలీం, మేధరి వర్కర్స్‌ యూనియన్‌ పరశురాము, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్ ల‌క్మినర్సయ్య ...

Read More »

ఘనంగా కార్మికుల‌ దినోత్సవం

నిజాంసాగర్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్‌ మండలంలోని కొమలంచలో కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజల‌కు వైరస్‌ సోకకుండ సేవలందించిన ఉద్యోగుల‌కు, నాయకుల‌కు భవన నిర్మాణ కార్మిక సంఘం కొమలంచ తరుపున శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో తెరాస మండల‌ అధ్యక్షుడు సత్యనారాయణ, సిడిసి ఛైర్మన్‌ గంగారెడ్డి, ఎంపీటీసీ ల‌క్ష్మీ నాగభూషణం గౌడ్‌, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు రాజా గౌడ్‌, మండల‌ కార్యదర్శి పండరి, కార్యదర్శి రాజు, కోశాధికారి పెంటయ్య తదితరులు ...

Read More »

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుండగా నందిపేట మండలం తొండాకుర్‌ గ్రామంలో మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి బియ్యం పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ ఆదేశాల‌ మేరకు తొండాకూరు గ్రామంలో ఉన్న ఇతర రాష్ట్రాల వల‌స కార్మికుల‌కు, గ్రామస్తుల‌కు రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు, కార్యక్రమంలో సర్పంచు దేవన, డీల‌ర్‌ సూకన్య గంగాధర్‌, గ్రామస్తులు తదితరులున్నారు.

Read More »

ఘన్‌పూర్‌లో ఘనంగా మేడే

డిచ్‌పల్లి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం 134వ మేడే దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ, నడిపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఎర్రజెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ మాట్లాడుతూ అమెరికాలో చికాగో ప్రాంతంలో కార్మికులు అందరూ కలిసి 12 గంటల‌ పని చేయమని, 8 గంటల‌ పని కల్పించాల‌ని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో వారి రక్తంతో ...

Read More »

నేటి నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నిర్మూల‌న కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత బియ్యం పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. గత నెల‌లో ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల‌ చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై 1500 రూపాయల‌ ఆర్ధికసాయం అందించింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 87.55 క్ష ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల‌ చొప్పున బియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు. ...

Read More »