Breaking News

రైతుల‌కు ఇబ్బందులు కల‌గ‌కుండా చూడాలి

రెంజల్‌, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలులో రైతుల‌కు ఎటువంటి ఇబ్బందులు కల‌గకుండా చర్యలు చేపట్టాల‌ని బోధన్‌ ఆర్‌డిఓ గోపి రామ్‌ అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి, రెంజల్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయన పరిశీలించారు. వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి, రైతుల‌కు గన్ని సంచుల‌ను ఇచ్చి, వెంటనే తూకం వేయాల‌ని ఆయన సూచించారు.

రైస్‌ మిల్‌లో కడతా చేపట్టినట్లయితే అధికారుల‌ దృష్టికి తీసుకు వచ్చి రైతుల‌కు లాభం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. పని తీరుపై కార్యదర్శి, ఏఎస్‌ఓపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసిల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపీడీవో గోపాల‌కృష్ణ, మండల‌ వ్యవసాయ అధికారి ల‌క్ష్మీకాంత్‌ రెడ్డి, ఆర్‌ఐ గంగాధర్‌, కార్యదర్శి రాందాస్‌ రైతులు ఉన్నారు.

Check Also

విద్యార్థుల‌కు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

రెంజల్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల‌కు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాల‌ని ఎంపీపీ ...

Comment on the article