Breaking News

Daily Archives: May 2, 2020

ఉపాధి హామీ కూలీల‌కు రెండు పూటలా పనులు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పూటలా ఉపాధి హామీ కూలీల‌కు పనులు కల్పించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శనివారం ఆయన మండల‌ స్థాయి అధికారుల‌తో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉదయం సాయంత్రం పూట పనులు కల్పించాల‌ని, ప్రతి కూలీకి రూ.237 వచ్చేలా చూడాల‌ని కోరారు. మండల‌ స్థాయి అధికారులు పనుల‌ను పర్యవేక్షణ చేయాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోతురే, డిఆర్‌డిఓ పిడి చంద్రమోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

4 నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈనెల‌ 4వ తేదీ నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గన్ని బ్యాగులు, కాంటాల‌ను సిద్ధం చేయాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్యా, డిసిఓ గంగాధర్‌ ఉన్నారు.

Read More »

ఉపాధి హామీలో అడిగిన కూలీలందరికి పనులు కల్పించాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు, ఉపాధి కూలీలు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో పంచాయతీ కార్యదర్శిల‌తో ఉపాధి హామీ పనుల‌పై సమీక్ష నిర్వహించారు. కూలీలు తప్పనిసరిగా మా స్కూలు ధరించే విధంగా చూడాల‌ని కోరారు. మాస్కు ధరించడం వ‌ల్ల‌ దుమ్ము ధూళి నోట్లోకి చేరకుండా ఉంటుందని, కరోనా నియంత్రణకు మాస్కు దోహదపడతాయని అవగాహన కల్పించాల‌ని పేర్కొన్నారు. పనిచేస్తున్న కూలీల‌ వివరాల‌ను మాస్టర్‌లో నమోదు చేయాల‌ని, గ్రామాల్లో ...

Read More »

రైతుకు భరోసా ఇచ్చేది ఎవరు…?

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండలంలోని యాడారం గ్రామానికి చెందిన చాకలి దేవరాజు, తండ్రి నర్సయ్య అనే రైతు అదే గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత పది రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో గత నాలుగు రోజుల‌ క్రితం ఎండ వేడిమికి తట్టుకోలేక గుండెపోటుతో కొనుగోలు కేంద్రం వద్దనే మరణించడం జరిగిందని, దీని వ‌ల్ల‌ అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం జరిగిందని ఏఐకెఎస్‌ (అఖిల‌ భారత రైతు ...

Read More »

బాటసారుల‌కు పండ్లు పంపిణీ చేసిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మీదుగా జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్‌ వెళ్తున్న 40 మంది వల‌స కూలీల‌కు తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీమ చేతుల‌ మీదుగా పండ్లు, మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేశారు. అదేవిధంగా వర్సిటీ సమీపంలోని దేవపల్లి క్యాంప్‌కు చెందిన పేదల‌కు ఒక్కొక్కరికి 5 కిలోల‌ చొప్పున బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాల‌ను కో ఆర్డినేటర్‌ ప్రవీణాబాయి అభినందించారు.

Read More »

49వ డివిజన్‌లో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 49వ డివిజన్‌ లోని పేద ప్రజలు, రేషన్‌ కార్డు లేకుండా సరుకులు అందని నిరుపేదల‌ను గుర్తించి వారికి నిత్యవసర సరుకులు అందజేసినట్టు కార్పొరేటర్‌ మెట్టు విజయ్‌ తెలిపారు. పేద ప్రజల‌ ఆకలి తీర్చాల‌నే సంక్పంతో పార్టీ పెద్దలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, శ్యాం ఏజెన్సీస్‌ సోమాని వారి సహాయ సహకారాల‌తో నిత్యవసర వస్తువులు సేకరించి పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు 49వ డివిజన్‌ అభివృద్ది కమిటీ కూడా సహకారం అందిస్తుందన్నారు. ఇకముందు కూడా సహాయం ...

Read More »

రైస్‌మిల్లును పరిశీలించిన డిసిసిబి ఛైర్మన్‌ భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ నియోజకవర్గము, బీర్కూర్‌ మండలంలోని సిద్ధివినాయక రైస్ మిల్లును జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. రైతుల‌కు ఎటువంటి ఇబ్బంది కల‌గకుండా వెంట వెంటనే అన్‌లోడ్‌ చేసుకొని లారీల‌ను పంపించాల‌ని రైసెమిల్‌ యాజమాన్యాన్ని ఆదేశించారు. స్థానిక పిఏసిఎస్‌ అధ్యక్షుడు గాంధీ, మండల‌ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అశోక్‌, మండల‌ అధ్యక్షుడు వీరేశం, మండల‌ ఎంపిపి రఘు, ఎంపీటీసీ సందీప్‌, మైలారం పిఏసిఎస్‌ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్‌, ...

Read More »

బాటసారుల‌కు తినుబండారాలు అందజేసిన ఇందూరు న్యాయవాదులు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద లాక్‌డౌన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ స్వస్థలాకు వెళ్లేందుకు కాలి నడక సాగిస్తున్న అంతరాష్ట్ర వల‌స కూలీల‌కు శనివారం ఇందూరు న్యాయవాదులు తినుబండారాలు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, న్యాయవాది సిహెచ్‌ హరిహర, సామాజిక కార్యకర్త నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఎం సహాయనిధికి రూ.1,00,116 విరాళం

బాన్సువాడ, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) కి రూ.1,00,116 (ల‌క్షా నూట పదహారు రూపాయలు) బాన్సువాడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్‌ స్టేషన్‌ (పేట్రోల్‌ పంప్‌) యజమాని, వీరసేవ లింగాయత్‌ జంగం జిల్లా గౌరవ అధ్యక్షుడు సిద్దలింగయ్య స్వామి విరాళంగా అందజేశారు. శనివారం బాన్సువాడ పట్టణంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి చెక్‌ అందజేశారు.

Read More »

వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల‌ను ప్రభుత్వం ఆదుకోవాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడగండ్ల వానతో నష్టపోయిన పంటల‌ను, కూలిన ఇండ్లను మాజీమంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరిశీలించారు. వడగండ్ల వానతో భిక్కనూరు మండలం బిక్కనూర్‌ గ్రామంలో, సిద్ధ రామేశ్వర నగర్‌ రామేశ్వరం పల్లి, తిప్పాపూర్‌ గ్రామాల‌లో దాదాపు వెయ్యి ఎకరాల‌లో వరి పంట, మొక్కజొన్న వంద శాతం నష్టం వాటిల్లింది. బిక్కనూరు మండలంలోని తిప్పాపూర్‌ గ్రామంలో 500 ఎకరాల‌ చేతికొచ్చిన వరి పంట వడగండ్ల వానతో నేల‌ పాలైందని షబ్బీర్‌ ...

Read More »

లింబాద్రి నర్సింహస్వామి దేవస్థానం తరఫున ఆహార వితరణ

భీమ్‌గల్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ నింబాద్రి ల‌క్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం తరపున భీంగల్‌ అన్నదాత కార్యక్రమంలో భాగంగా 350 మంది యాచకుల‌కు, పేదవారికి శనివారం మధ్యాహ్న భోజన వితరణ చేశారు. వీరికే కాకుండా రోజూవారీలాగే భీంగల్‌తో పాటు పురాణిపేట్‌, బెజ్జోర, రామన్నపేట్‌, జాగిర్యాల్‌ గ్రామాల‌కు 150 మంది కోవిడ్‌-19 సహాయకుల‌తో కలిపి 500 మందికి మధ్యాహ్న భోజన సరఫరా చేసినట్టు ఆల‌య ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More »

అమ్మా లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయాం…

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ లాక్‌ డౌన్‌లో ఇరుక్కుపోయాం… ఏదైనా సహాయం చేయండమ్మ అని వల‌స కూలీలు పది కుటుంబాలు అర్థించారు. దీంతో లింగంపేట్‌ వద్ద లింగుపల్లి అనే చిన్న గ్రామంలో పోతరాజు జయవ్వ, పోచయ్య దంపతులు వారిని అక్కున చేర్చుకున్నారు. 34 రోజులుగా పది కుటుంబాల‌కు రోజు అంబలి ఇస్తున్నారు. తమకు వచ్చిన రేషన్‌ బియ్యాన్ని వారికి అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. కాగా సామాజిక కార్యకర్త రంజిత్‌ మోహన్‌, తన బృందంతో కలిసి శనివారం ...

Read More »

తక్కువ ల‌క్ష్యాలు సాధించిన వైద్యుల‌పై చర్యలు

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ ల‌క్ష్యాల‌ను సాధించిన వైద్యుల‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో శనివారం వైద్య అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యాధికారులు నిబద్ధతతో పని చేయాల‌ని, గర్భిణీల‌ నమోదు, వ్యాధి నిరోధక టీకాల‌ విషయంలో ఆరోగ్య కేంద్రాల‌ వారీగా సమీక్ష చేశారు. విధుల‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధుల‌ నుంచి తొల‌గిస్తామని, ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో అయ్యేవిధంగా చూడాల‌ని కోరారు. నిరుపేదల‌కు ప్రభుత్వ ...

Read More »

ఆసుపత్రి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

బీర్కూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, పరిసరాల‌ను బీర్కూర్‌ సర్పంచ్‌ కుమారి అవారి స్వప్న, గంగారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు రికార్డులు పరిశీలించి సౌకర్యాల‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు పేద ప్రజలే కాబట్టి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల‌ని, అవసరమైన రోగుల‌కు గ్లూకోస్‌ ఎక్కించాల‌ని, ఆసుపత్రిలో గదులు, పరిసరాల‌ను కూడ పరిశుభ్రంగా ఉంచాల‌ని సిబ్బందికి సూచించారు. రాబోవు రోజుల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల‌ కంటే ...

Read More »