Breaking News

కల్యాపూర్‌లో మాస్కుల‌ పంపిణీ

రెంజల్‌, మే 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామంలోని ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు సుమారు నాలుగు వందల మాస్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా యూత్‌ అధ్యక్షుడు నవీన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల్లో వ్యయసాయ పనులు, ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తమ వంతు సాయంగా గ్రామంలోని 400 వందల‌ కుటుంబాల‌కు రెండు వేల‌ మాస్కులు అందజేశామన్నారు. మాస్కులు పంపిణీ చేసిన యువతను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు మురళి, సాయినాథ్‌, గంగప్రసాద్‌, గణేష్‌, అనిరుద్‌ ఉన్నారు.

Check Also

శివాల‌యాల‌ వద్ద అన్నదానం

రెంజల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ...

Comment on the article