Breaking News

అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత

భీమ్‌గల్‌, మే 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ల‌క్ష్మీనరసింహ వైన్స్‌ యజమాని రాకేష్‌ చట్టవ్యతిరేకంగా తన ఇంట్లో మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌ తన సిబ్బందితో వైన్స్‌ యజమాని ఇంటిపై దాడి చేశారు.

24 ఎంసి మద్యం సీసాలు 375 ఎంఎల్ కల‌వి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే అమ్ముడుపోయిన మద్యానికి సంబంధించిన డబ్బు 5 ల‌క్షల‌ 50 వేల‌ రూపాయల‌ నగదు కూడా స్వాధీనం చేసుకొని భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Check Also

లింబాద్రి ల‌క్ష్మీనర్సింహస్వామి ఆల‌యం తరఫున అన్నదానం

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఉత్తరాదిమఠాధీశులు శ్రీ శ్రీ శ్రీ 1008 శ్రీసత్యాత్మ ...

Comment on the article