Breaking News

Daily Archives: May 5, 2020

వంద కుటుంబాల‌కు పోలీసు సిబ్బంది సహాయం

ఆర్మూర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజన్‌కు చెందిన పోలీసు సిబ్బంది మంగళవారం లాక్‌డౌన్‌ బాధిత వంద కుటుంబాల‌కు సహాయం చేశారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల‌ బియ్యం, 18 రకాల‌ నిత్యవసర సరుకులు, 5 రకాల‌ పండ్లు అందజేశారు.

Read More »

మే 20 లోగా ధాన్యం కొనుగోళ్ళు పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లను వేగవంతం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో మండల‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. 17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాల‌ని, మండలాల‌ వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొనుగోలు చేయవల‌సిన ధాన్యం ఎంత, ఎన్ని రోజుల్లో కొనుగోలు పూర్తి చేస్తారు తదితర అంశాల‌ను మండలాల‌ వారీగా వివరాలు అడిగి ...

Read More »

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన రైతు నిట్టు శంకర్‌ రావు (45) వ్యవసాయ భూమి వద్ద విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. లింగపూర్‌ శివారులో ఉన్న పొలం వద్ద కేబుల్‌ వైర్‌ తెగిపోగా జాయింట్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని బోరున విల‌పించారు. కుటుంబ పెద్ద అకాల‌ మరణం ఆ ఇంట్లో ...

Read More »

పాముకాటుతో వ్యక్తి మృతి

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం రాత్రి 11 గంటల‌ సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన నిమ్మ బాల‌రాజు చిన్న కొడుకు, నిమ్మ అజయ్‌ తన తల్లి ల‌క్ష్మి, అన్న రాకేష్‌ తో కలిసి వేసవి కాలం దృష్ట్యా వారింటి వాకిట్లో నిద్రపోయారు. కాగా విష పాము కాటు వేయడంతో గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల‌ సమయంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ల‌క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ...

Read More »

నర్సరీలో నూరుశాతం మొక్కలు పెంచాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పని కావాల‌ని కోరిక ప్రతి కూలీకి పని కల్పించాల‌ని, పనుల క‌ల్ప‌నలో ఎలాంటి అల‌సత్వం వహించవద్దని నిజామాబాద్‌ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల‌ ఉపాధి హామీ సిబ్బందితో గ్రామాల్లో కూలీల‌కు పని కల్పించే విషయంలో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ముప్కాల్‌, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, ఇందల్‌ వాయి, మొస్రా మండలాల్లో కూలీలు చాలా తక్కువ సంఖ్యలో హాజరవుతున్నందున, కూలీల‌ హాజరు శాతం పెంచాల‌ని కోరారు. కొల‌తల‌ ...

Read More »

దుబాయిలో ఆర్మూర్‌ వాసి కోవిడ్‌-19తో మృతి

ఆర్మూర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం అరుంధతినగర్ కాల‌నీకి చెందిన గోసం బాబు (45) గత నెల‌ 21 న గుండె పోటుతో దుబాయ్‌లో మరణించాడ‌ని కుటుంబ స‌భ్యులు భావించారు. బాబు ఒక ప్రవేట్‌ కంపెనీలో పని చేసేవాడు, అతని మృతదేహాన్ని తెప్పించడం కొరకు కుటుంబీకులు ప్రవాస భారతీయుల‌ సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడును కలిసి విషయం వివరించారు. కాగా దేశంలో ఉన్న ఫోరమ్‌ అధ్యక్షుడు రమేష్‌, జంగం బాల‌కిషన్‌ ద్వారా ప్రయత్నించి ...

Read More »

పండ్ల మొక్కలు సంరక్షిస్తే అడవి జంతువులు గ్రామాల్లోకి రావు

కామరెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట మండల‌ కేంద్రంలో మంకీ ఫుడ్‌ కోర్టును మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. పండ్ల మొక్కల‌ను సంరక్షణ చేస్తే అడవి జంతువులు గ్రామాల్లోకి రావని సూచించారు. ఉపాధిహామీ కూలీలు ఉదయం 6 గంటల‌కు పనుల‌కు వెళ్లి 11 గంటల‌కు పనులు ముగించాల‌ని, అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల‌ నుంచి 7 గంటల‌ వరకు పనులు చేపట్టాల‌ని కోరారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు చేపట్టిన ధాన్యం వివరాల‌ను ...

Read More »

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతు సంక్షేమ దీక్ష

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమస్యల‌ పరిష్కారానికై సోనియా గాంధీ, మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో మంగళవారం రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రైతు పండిరచిన ప్రతి గింజ రైతుకు గిట్టుబాటు అయ్యే వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని, తరుగు పేరుతో రైస్ మిల్ల‌ర్ల, దళారుల‌ అక్రమాల‌ను, ఆగడాల‌ను అరికట్టి వారిపై కఠిన చర్యలు ...

Read More »

పద్యకవి కుసుమ రాజమ‌ల్లు ఇకలేరు

కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పద్యకవి, రమ్య నీతి శతక కర్త, దోమకొండకు చెందిన కుసుమ రాజమ‌ల్లు మంగళవారం ఉదయం స్వర్గస్తుల‌య్యారు. వీరి మరణం కామారెడ్డి సాహిత్యానికి తీరని లోటని తెలంగాణ రచయితల‌ వేదిక కామారెడ్డి జిల్లా శాఖ పేర్కొంది. పేదరికంలో కుటుంబాన్ని నడుపుతూ గత సంవత్సరం నుండి పక్షవాతంతో బాధపడుతూ ఆయన తన సాహిత్య రచనలు కొనసాగించారని, కుసుమ రాజమ‌ల్లు మరణం తీరని లోటని తెరవే నివాళులు అర్పించింది.

Read More »

ఇన్‌చార్జి ఆర్‌డివోగా వెంకటేశ్‌ దోత్రే

ఎల్లారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివోగా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిర్‌ బుంగారి రాము, నాయకులు ఇమ్రాన్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ సమస్యల‌ను విన్న అనంతరం వెంకటేష్‌ దొత్రే సానుకూలంగా స్పందించి అన్నిరకాల‌ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Read More »

ఇతర రాష్ట్రాల‌ నుంచి వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేయాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇతర రాష్ట్రాల‌ నుంచి తెలంగాణకు చేరుకుంటున్న వారిని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ చేసి హోమ్‌ క్వారంటైన్‌కు పంపాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా లోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు సాలూర, పోతంగల్‌ల‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెక్‌ పోస్టు వద్ద ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్‌ చేయాల‌ని, వేరే జిల్లాల‌ వారు అయిన పక్షంలో ఆయా జిల్లాల‌ కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాల‌ని, మహారాష్ట్రలోని ...

Read More »