Breaking News

Daily Archives: May 6, 2020

105 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 105 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 87, ఆటోలు 17, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు బుధవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

భౌతిక దూరం పాటించని మద్యం షాపులు మూసివేయాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం షాపుల‌ వద్ద భౌతిక దూరం పాటించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో డివిజనల్‌ స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉదయం 10 గంటల‌ నుంచి సాయంత్రం 6 గంటల‌ వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయని, భౌతిక దూరం పాటించని మద్యం షాపుల‌ను మూసి వేయాల‌ని ఎక్సైజ్‌ అధికారుల‌ను ఆదేశించారు. మద్యం విక్రయించే వ్యాపారులు, వాటిలో పనిచేసే సిబ్బంది, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ...

Read More »

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని సహకార సంఘాల‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్‌లో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మండల‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం మొక్కజొన్నలు, జొన్నల‌ కొనుగోలు కేంద్రాల‌ను గురువారం నుంచి ప్రారంభించాల‌ని, 30 వేల‌ మెట్రిక్‌ టన్నులు నిలువ‌చేసుకోవడానికి మేడ్చల్లో గోదాం అనుకూలంగా ఉందని చెప్పారు. మే రెండో వారంలో సహకార సంఘాల‌ ద్వారా రసాయనిక ఎరువుల‌ను విక్రయించాల‌ని, ...

Read More »

ల‌లితా జ్యువెల్ల‌ర్స్‌ కోటి రూపాయల‌ విరాళం

హైదరాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వ్యాప్తి నివారణకు, లాక్‌ డౌన్ వ‌ల్ల‌ ఇబ్బంది పడుతున్న పేదల‌ను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల‌కు సహాయంగా ఉండడం కోసం ల‌లితా జ్యువెల్ల‌ర్స్‌ కోటి రూపాయల‌ విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ల‌లిత జ్యువెల్ల‌ర్స్‌ సిఎండి డాక్టర్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ సీఎంకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాల‌కు కూడా చెరో కోటి రూపాయల‌ విరాళం అందిస్తున్నట్లు కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

Read More »

లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో లాక్‌ డౌన్‌ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్్స‌ను నియమించామని, ఎటువంటి ఉల్లంఘనకు పాల్ప‌డినా జరిమానాలు విధించడానికి ఫ్లైయింగ్‌ స్క్వాడ్్స‌కు అధికారాలు జారీచేయడం జరిగిందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి కట్టడికై విధించిన లాక్‌ డౌన్‌ నిబంధనల‌ను బుధవారం నుండి కొంత వరకు సడలించి మార్గదర్శకాలు జారీచేసినందున, మార్గదర్శకాల‌కు అనుగుణంగా జిల్లాలోని ప్రజలంతా నడుచుకోవాల‌ని, ఎటువంటి ...

Read More »

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసు విచారణ…

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హత్య కేసులో జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్‌ మంజూరు కోసం బుధవారం కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి. సత్తయ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. కామారెడ్డి పట్టణంలో గత నెల 22 న‌ జరిగిన గొడవలో ఒకరిని హత్యా యత్నం కేసు కింద పోలీసులు జైలుకు పంపారు. దీనికి సంబంధించి ముద్దాయి బంధువులు న్యాయవాది ద్వారా అదనపు జిల్లా జడ్జి సత్తయ్యను ఇమెయిల్‌ ద్వారా ఆశ్రయించారు. దాంతో న్యాయమూర్తి అత్యవసర ...

Read More »

కథలాపూర్‌లో రాళ్ల వాన

జగిత్యాల‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల‌ జిల్లా కథలాపూర్‌ మండలంలోని పోతారం, అంబారిపేట, తండ్రియా, గంభీర్‌ పూర్‌ గ్రామాల‌తో పాటు పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలుల‌తో కూడిన రాళ్ల వర్షం కురిసింది. దీంతో ఇటీవల‌ కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన తమను ఆదుకోవాల‌ని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read More »

మద్యం కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లాలో బుధవారం నుండి ప్రారంభమైన మద్యం అమ్మకాల‌ తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల‌కు అనుగుణంగానే భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారా అని వాకబు చేశారు. మద్యం కొనుగోలు చేసేవారు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల‌ని, చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. పట్టణంలోని పెద్ద బజార్‌, శివాజీ నగర్‌, వర్ని రోడ్డు, పూలాంగ్‌ చౌరస్తా, వినాయక్‌ నగర్‌, కంటేశ్వర్‌, కంటేశ్వర్‌ ...

Read More »

ఎరువులు, యూరియా కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించాలి

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వర్షాకాంలో ఎరువులు, ఫర్టిలైజర్‌ యూరియా కొరత లేకుండా ప్రణాళిక రూపొందించాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో రైతుల‌కు ఫర్టిలైజర్‌ యూరియా కొరత లేకుండా చూడాల‌ని, ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు వచ్చినటువంటి ఎరువుల‌ను యూరియాను అన్ని హోల్‌సేల్‌, రిటైల్‌, ఫాక్స్‌ సొసైటీల‌కు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ...

Read More »

హైపోక్లోరైడ్‌ పిచికారి వాహనం ప్రారంభం

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యం ముందు బుధవారం మాజీ మంత్రి మాజీ ప్రతిపక్షనేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ హైపోక్లోరైడ్‌ రసాయన ద్రావణం పిచికారి వాహనాన్ని ప్రారంభించారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌ మోహన్‌ రావు, మదన్‌ మోహన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా బయోటెక్‌ అమెరికన్‌ కంపెనీ ద్వారా ఓజెన్‌ రసాయనం కొనుగోలు చేసి, హైపోక్లోరైడ్‌ రసాయనం రెండుకలిపి కామారెడ్డి ...

Read More »

కరోనా రోగుల‌ గురించి నిజాలు దాస్తున్నారు…

కామారెడ్డి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రోజు ఏడున్నర గంటల‌ పాటు జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరుల‌ సమావేశంలో పిట్టల‌ దొరలా కహానీలు చెప్పారని, రాష్ట్ర ప్రజల‌కు సందేశాన్ని ఇస్తారని ఆశించాం కానీ అనుకున్న విధంగా మాట్లాడలేకపోయారని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు. బుధవారం కామరెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షం అయినా కరోనా సమయంలో ...

Read More »

కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన బిజెపి నేతలు

ఆర్మూర్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి 40 కిలోల‌ బస్తాకు రెండు కిలోలు తరుగు తీస్తున్నారని, ఇది కాకుండా 40 కిలోల‌ బస్తాకు రైస్‌మిల్ల‌ర్లు కూడా ఒకటి లేదా రెండు కిలోలు తరుగు తీస్తామని చెప్పడంతో రైతులు ఒప్పుకుంటేనే వడ్ల సంచుల‌ను తీసుకుంటామని లేకుంటే తీసుకోండి అని రైతుకు చెప్పడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం భారతీయ జనతాపార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ వినయ్‌, నుతుల‌ శ్రీనివాస్‌ రెడ్డి మచ్చెర్ల, కుదవంద్‌ పూర్‌, మాక్లూర్‌, గొట్టిముక్కుల‌ గ్రామాల‌లో ...

Read More »

148 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 148 వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 132, ఆటోలు 15, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు మంగళవారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »