Breaking News

Daily Archives: May 7, 2020

అంగన్‌వాడిల్లో త‌ల్లులు, గర్భిణీలు భౌతిక దూరం పాటించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవలందించడంలో అల‌సత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో ఐసిడిఎస్‌ సిడిపిఓల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భవతుల‌కు, త‌ల్లులకు, చిన్నారుల‌కు పౌష్టికాహారం అందించాల‌ని, నాణ్యతలేని ఆహారం, గుడ్లు అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షకులు, సిడిపివోలు కేంద్రాల‌ను తనిఖీలు చేయాల‌ని, కేంద్రాల్లో త‌ల్లులు, గర్భవతులు భౌతిక దూరం పాటించే విధంగా చూడవల‌సిన బాధ్యత అంగన్‌వాడి కార్యకర్తపై ఉందని ...

Read More »

ఇతరులు 28 రోజులు గృహనిర్బంధంలో

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇతర జిల్లాల‌ వారికి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇతర దేశాల‌, రాష్ట్రాల‌ జిల్లాల‌ నుంచి వచ్చిన వారిని గృహనిర్బంధంలో ఇరవై ఎనిమిది రోజుల‌పాటు ఉంచాల‌ని సూచించారు. శ్వాసకోశ వ్యాధుల‌తో బాధపడుతున్నవారు దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రుల‌కు వస్తే వారి సమాచారాన్ని కచ్చితంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ...

Read More »

యువకుని ప్రాణం తీసిన కూల‌ర్‌

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం ఆర్యనగర్ కాల‌నీకి చెందిన ఇప్ప కాయల‌ సాయిరాం (33) గురువారం కూల‌ర్‌లో నీళ్లు నింపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసురాగానే అప్పటికే సాయిరాం మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్దునికి రక్తదానం

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన పెంట్యా అనే 60 సంవత్సరాల‌ వృద్దునికి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని లైఫ్‌ వైద్యశాల‌ లో ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో వి టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదాత కామారెడ్డి పట్టణానికి చెందిన పటేల్‌ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాడు. వీరికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు ...

Read More »

మే రెండో వారంలో ఎరువులు విక్రయించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని సహకార సంఘాల‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాల‌ని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్స్‌లో మండల‌ స్థాయి అధికారుల‌తో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం మొక్కజొన్నలు, జొన్న కొనుగోలు కేంద్రాల‌ను గురువారం నుంచి ప్రారంభించాల‌ని సూచించారు. 30 వేల‌ మెట్రిక్‌ టన్నులు నిలువ‌చేసుకోవడానికి మేడ్చల్‌లో గోదాం అనుకూలంగా ఉందని చెప్పారు. మే రెండో వారంలో సహకార సంఘాల‌ ద్వారా రసాయనిక ఎరువుల‌ను విక్రయించాల‌ని ...

Read More »

అన్ని ప్రభుత్వ కార్యాల‌యాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల‌కు సంబంధించిన కార్యాల‌యాలు ఇకపై పూర్తి స్థాయిలో పని చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం జిల్లా అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ నె 5వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాలు, ముఖ్యమంత్రి సూచనల‌ మేరకు రాష్ట్రంలోని అన్ని శాఖల‌కు సంబంధించిన కార్యాల‌యాలు పూర్తి స్థాయిలో పని చేయాల‌ని, కోవిడ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రతి శాఖ తమ తమ శాఖల‌కు సంబంధించిన ...

Read More »

ప్రమాదకర రసాయన పరిశ్రమల‌పై జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశాఖలో ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ప్రమాద దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా వందల‌ మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మృతుల‌ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నదని, దుర్ఘటనకు కారణమైన కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల‌ని పౌరహక్కుల‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌కు కోటి రూపాయల‌ చొప్పున కంపెనీ నుండి ఇప్పించి ఆదుకోవాల‌న్నారు. ఇప్పటికైనా ప్రమాదకర రసాయనాల‌ ...

Read More »

ఘనంగా అల్లూరి 96వ వర్ధంతి

ఆర్మూర్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్లూరి సీతారామరాజు 96 వ వర్ధంతి సందర్భంగా పివైఎల్‌, పిడిఎస్‌యు నాయకులు నివాళుల‌ర్పించారు. ఆర్మూర్‌ కుమార్‌ నారాయణ భవన్‌లో పివైఎల్‌ నాయకులు అల్లూరి చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుమన్‌, డివిజన్‌ కార్యదర్శి నిఖిల్‌, తూర్పటి శ్రీనివాస్‌, ప్రసాద్‌, పిడిఎస్‌యు ఏరియా కార్యదర్శి దేమొల్ల‌ నిఖిల్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు. దేగాం గ్రామంలో పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, సర్పంచ్‌ సరోజా గంగారెడ్డి, ఎంపీటీసీ అనూష శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభు, ...

Read More »

ప్రభుత్వం రైతుల‌ను ఆదుకోవాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతును ప్రభుత్వం ఆదుకోవాని, రైతుల‌కు మద్దతుగా శాసన సభ మాజీ పక్షనేత యెండల ల‌క్ష్మీనారాయణ దీక్ష చేపట్టారు. గురువారం భారతీయ జనతాపార్టీ నిజామాబాద్‌ జిల్లా పార్టీ కార్యాల‌యంలో దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా యెండల‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల‌ను పరిష్కరించడంలో పూర్తిగా విఫల‌మైందని, రైతుల‌ను ప్రభుత్వం ఆదుకోవాల‌ని, రైతుకు మద్దతుగా దీక్ష చేపట్టామన్నారు. దీక్షలో యెండల‌ సుధాకర్‌, నారాయణ యాదవ్‌, స్వామి యాదవ్‌, భారత్‌ భూషణ్‌, శ్రీనివాస్‌ శర్మ, ...

Read More »

ఆర్‌జి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల‌ పంపిణీ

డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి 44 డిచ్‌పల్లి మీదుగా స్వస్థలాల‌కు వెళ్తున్న వల‌స కార్మికుల‌కు ఆర్‌జి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ కుటుంబ సభ్యులు పదార్థాలు స్వయంగా తయారుచేసి పంచిపెట్టారు. సుమారు 50 మందికి ఆలు బిర్యాని, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఫౌండేషన్‌ సభ్యులు, రేలా రే రేలా గంగా, ఆమె భర్త సుదర్శన్‌ ఎక్కడికి వెళ్తున్నారని వల‌స కార్మికుల‌ను ప్రశ్నించగా ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల‌కు న్యాయవాదుల‌ సహకారం

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్ట్‌ ఆవరణలో సీనియర్‌ న్యాయవాది వెంకట్రాంరెడ్డి, కామారెడ్డి మున్సిపల్‌ కార్మికుల‌కు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. సుమారు 300 మంది కార్మికుల‌కు ఆహార ప్యాకెట్లు, గ్లౌజ్‌లు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అందజేశారు. ఇందుకోసం న్యాయవాది వెంకట్రాంరెడ్డి సహకారం అందించారు. కార్యక్రమానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజ్‌ కుమార్‌ అతిథులుగా విచ్చేసి పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ల‌క్ష్మణ్‌ రావు, ప్రధాన కార్యదర్శి బండారి ...

Read More »

ఆటో కార్మికుల‌కు నెల‌కు రూ. 5 వేల‌ ఇన్సెంటివ్‌ ఇవ్వాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఏఐటియుసి ఆటో యూనియన్‌ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ రెండు నెల‌లుగా కరోనా మహమ్మారి వ‌ల్ల‌ లాక్‌ డౌన్‌ విధించడంతో ఆటో కార్మికుల‌కు జీవనోపాధి కరువైందని, వారి కుటుంబాలు రోడ్డున పడినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల‌ మాదిరిగా ఒక కార్మికునికి రూ. 5 వేల‌ ఇన్సెంటివ్‌ ఇవ్వాల‌ని, రూ. 10 వేల‌ రుణ ...

Read More »

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ రాస్తూ రద్దుచేసిన జీవో నంబరు 3 ను పునరుద్దరించి ఎస్‌టి హక్కులు కాపాడాల‌ని కోరుతూ ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్డివో కార్యాల‌యం ముందు నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు విషయంలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ద నిర్ణయంపై సుప్రీంకోర్టు పున ...

Read More »