Breaking News

Daily Archives: May 9, 2020

లాక్‌ డౌన్ ఉల్లంఘించిన వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 131 వాహనాలు సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు 111, ఆటోలు 19, ఫోర్ వీల‌ర్స్‌ 1 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ ...

Read More »

కరోనాతో సహజీవనం చేయాల్సిందే

– మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే వర్షాకాలంలో సీజ‌నల్‌ వ్యాధుల‌ నివారణకు కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్‌, ఐటీ శాఖామంత్రి కే.తారక రామారావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుండి అడిషనల్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల‌ నుండి 10 నిమిషాలు ప్రతిఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో, పూల‌ తోటలో, కుండీల‌లో, పాత పనికిరాని వస్తువుల‌లో నీళ్ళు నిలువ‌ ఉంటే శుభ్రపరుచుకోవాల‌ని, రానున్న వర్షాకాలంలో ...

Read More »

అటవీ ప్రాంతం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండ‌లం రత్నగిరి పల్లిలో శనివారం కందకాల‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పరిశీలించారు. కూలీలు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేపట్టాల‌ని, అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వడం వ‌ల్ల‌ కలిగే ప్రయోజనాల‌ను కూలీల‌ను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిలిచి భూగర్భ జలాలు పెరుగుతాయని, తమకు ఉపాధి ల‌భిస్తోందని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకోవాల‌ని, ఆడబిడ్డ జన్మిస్తే ప్రభుత్వం 13 వే రూపాయలు, మగ బిడ్డ జన్మిస్తే 12 వేల‌ రూపాయలు ...

Read More »

మానవత్వం చాటుకున్న బోధన్‌ సిఐ

బోధన్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయన పేరు గోపాల్‌ శర్మ, ఒక వృద్ధ అనాధ, ఎక్కడో ఒడిసా రాష్ట్రానికి చెందిన ఈయన బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తానే సొంత గూడుగా భావించాడు. రోడ్డు పక్కనుండే వృద్ధుడు అనుకుంటున్నారేమో కానీ ఆయన మాట్లాడే ఇంగ్లీష్‌ ఈ తరం బడిపిల్ల‌ల‌కు సైతం కష్టమేనండి. అన్నం పెట్టడానికి వెళ్లిన ప్రతీ ఒకరిని హై హవ్‌ ఆర్‌ యు అంటూ ప్రేమగా పల‌కరించేవారు. కానీ వయసు మళ్ళిన బక్కచిక్కిన బ్రతుకాయే, ఎండ ధాటికి వడిలిపోయాడు. ఓ ...

Read More »

కుక్కపై చిరుత దాడి

కలెక్టరేట్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాత్రి 10.30 గంటల‌కు అంబం గ్రామ శివారు ప్రాంతంలో మాజీ సర్పంచు ఆర్జే ధనకోటి ఇంటి ఆవరణలో కట్టేసిన కుక్కపై చిరుత పులి దాడి చేయడాన్ని గమనించారు. ఇంటి యజమాని కుక్క అరుపులు విని లేచి అరవడంతో పులి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. గ్రామ సర్పంచ్‌ గంగా ప్రసాద్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయడంతో సర్పంచ్‌ అటవీశాఖ సిబ్బందికి, జిల్లా అధికారుల‌కు తెలియజేశారు. జిల్లా యంత్రాంగం మండల‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ...

Read More »

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎడమకాలువకు భీం రెడ్డి పేరు పెట్టాలి

కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఎంసిపిఐయు పార్టీ పొలిట్‌ బ్యురో నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ నేతగా ప్రజల‌పక్షాన మట్టి మనిషిగా పోరాడిన యోధుడు కామ్రేడ్‌ భీం రెడ్డి నరసింహారెడ్డి అని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్‌, జిల్లా కార్యదర్శి రాజ లింగం తెలిపారు. భీం రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల‌మాల‌ వేసి ఘనంగా నివాళులు ...

Read More »

కామారెడ్డిలో వడగండ్ల వాన బీభత్సం

కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల‌ ప్రాంతంలో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. సుమారు 40 నిమిషాల‌ పాటు ఏకధాటిగా రాళ్ల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల‌ వద్ద వరి ధాన్యం నీటిపాలైంది. ఈదురుగాలుల‌కు చెట్లు నేల‌కొరిగాయి. చేతికందిన పంట తమ కళ్ల ఎదుటే నీటి పాలు కావడంతో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో కామారెడ్డి పట్టణంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా ...

Read More »