Breaking News

వసతులులేని జూనియర్‌ కళాశాలల‌ అనుమతులు రద్దు చేయాలి

నిజామాబాద్‌, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలోని సరైన వసతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల‌ను వెంటనే అనుమతులు రద్దు చేయాల‌ని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ జిల్లా కన్వీనర్‌ భైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

కేవలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చుట్టూపక్కల‌ కొన్ని కార్పొరేట్‌ కళాశాలల‌ను అనుమతులు రద్దుచేసి చేతులు దులుపుకున్న ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేట్‌ కళాశాల‌లో సరైన వసతులు, భవనాలు, సైన్స్‌ ల్యాబ్స్‌, కంప్యూటర్లు, ఫైర్‌ సేఫ్టీ, తరగతి గదులు, ప్లే గ్రౌండ్లు, అర్హులైన లెక్చరర్లు లేకుండా ఉన్న కళాశాల‌లు మీకు కనిపించడం లేదా అని విద్యాశాఖ అధికారుల‌ను ప్రశ్నించారు.

ప్రతిఏటా ఇంటర్మీడియట్‌ బోర్డుపై ఆరోపణలు వచ్చేవని, అలా వచ్చిన కొన్ని రోజులు కళాశాల‌ల తనిఖీ నిర్వహించి యథావిధిగా కొనసాగించేవారని అయన చెప్పారు. విద్యాశాఖ అధికారులు ఇలా చేస్తూ విద్యార్థుల‌కు అన్యాయం చేస్తున్నారని అయన తెలిపారు. ఇప్పటికైనా ప్రకటనలు మానుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్‌ కళాశాల‌లను విద్యాశాఖ అధికారులే స్వయంగావెళ్లి పరిశీలించి అనుమతులు ఇవ్వాల‌ని రవీందర్‌ కోరారు.

ముఖ్యంగా విద్యార్థులు స్కాల‌ర్‌ షిప్‌లు, ప్రైవేట్‌ కళాశాల‌ల యాజమాన్యాలు లాక్కుంటున్నారని, ఈ విషయంపై ప్రతి కళాశాల‌ మీద విచారణ జరిపించాల‌ని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యాశాఖ అధికారులు ప్రతికళాశాల‌లో తనిఖీలు నిర్వహించి విద్యార్థుల‌కు న్యాయం జరిగేలా చూడాల‌ని డిమాండ్‌ చేశారు.

Check Also

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ ...

Comment on the article