Breaking News

Daily Archives: May 12, 2020

ఇంటర్‌ మూల్యాంకన కేంద్రం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి జిల్లాలోని ఇంటర్‌ పరీక్ష మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. నిజామాబాద్‌లో ఇంటర్‌ జవాబు పత్రాల‌ మూల్యాంకనం మంగళవారం ఖిల్లా బాలుర జూనియర్‌ కళాశాల‌, కంఠేశ్వర్‌ మహిళా కళాశాల‌లో ప్రారంభమైంది. మూల్యాంకనం లో మొత్తం 350 మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొనగా, ఇంగ్లీష్‌, మాథ్స్‌, సంస్కృతం ఖిల్లా బాలుర కళాశాల‌లో, సివిక్స్‌ కంఠేశ్వర్‌లోని మహిళా కళాశాల‌లో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ మూల్యాంకన కేంద్రం పరిసరాల‌ను పరిశీలించి, ...

Read More »

ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్న మంత్రి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద జార్ఖండ్‌కు చెందిన వల‌స కూలీల‌తో వెళ్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం బోల్తాపడిన ఘటనపై మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతా రెడ్డితో ప్రమాద ఘటనపై ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న వీరు లాక్‌ డౌన్‌ ...

Read More »

వల‌స కూలీల‌కు రోడ్డు ప్రమాదం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ నుండి తమ స్వస్థలాల‌కు బయలు దేరిన వల‌స కూలీలు ప్రయాణిస్తున్న లారీ కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి గ్రామం వద్ద మంగళవారం బోల్తా పడిరది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది కూలీల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. గాయపడిన వారిని కామారెడ్డి సర్కారు దవాఖానకు తరలించారు. కాగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతుండగా హైదరాబాద్‌ నుండి తమ తమ స్వస్థలాలు మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల‌కు లారీలో పయనమయ్యారు. ప్రమాదవశాత్తు దగ్గి ...

Read More »

నిబంధనలు పాటించని దుకాణాలు సీజ్‌

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి పట్టణం తిల‌క్‌ రోడ్డులోని అంజలి లేడీస్‌ ఎంపోరియం, అల్‌ ఇన్‌ వన్‌ బజార్‌. శ్రీవేంకటేశ్వరమూర్తి కట్‌ పీస్‌ సెంటర్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా, సామాజిక దూరం లేకుండా, శానిటైజర్‌ వినియోగించకుండా వ్యాపార లావా దేమలు నిర్వహిస్తున్న మూడు దుకాణాల‌ను కామారెడ్డి పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది సీజ్‌ చేశారు. ఎవరైనా ప్రభుత్వ నియమాలు పాటించకుండా నిబంధనల‌కు వ్యతిరేకంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా వ్యాపార లావాదేవీలు చేసినట్లయితే వారి పట్ల చట్ట ...

Read More »

అత్యవసర దృవీకరణ పనుల‌ కోసం సంప్రదించండి

హైదరాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాయబార కార్యాల‌యం, మస్కట్‌ ఇటువంటి విపత్కర సమయాల్లో కూడా ఒమన్‌ లోని భారతీయ సమాజానికి అన్ని కాన్సుల‌ర్‌ సేవల‌తో సహాయం చేయడానికి తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఏదైనా అత్యవసర ధృవీకరణ పనుల‌ కోసం, ఎవరైనా సంప్రదించవచ్చని 93584040 ఫోన్‌ నుండి తీసుకున్న ముందస్తు అనుమతితో రాయబార కార్యాల‌యానికి రావచ్చని, మస్కట్‌ వద్ద పాస్‌పోర్టు పునరుద్ధరణ నియామకాల‌ కోసం, దయచేసి ఫోన్‌ 79806929 నెంబర్‌లో సంప్రదించాల‌ని పేర్కొంది. గ్లోబల్‌ మనీ ఎక్స్ఛేంజ్‌ మస్కట్ ...

Read More »

కళాకారుల‌కు నిత్యావసర సరుకుల‌ పంపిణీ

కామరెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాల‌య ఆవరణలో నూతనంగా కొనుగోలు చేసిన తడి చెత్త, పొడి చెత్త సేకరించే 10 వాహనాల‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మంగళవారం ప్రారంభించారు. అనంతరం 41 మంది మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల‌కు, 101 మంది కళాకారుల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆపత్కాల‌ సమయంలో వైరస్‌ మహమ్మారి నిర్మూల‌నకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు, ఆశా వర్కర్లకు ...

Read More »

తడి, పొడి చెత్త వాహనాలు ప్రారంభం

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాపై గ్రామస్థాయిలో కళాకారులు ప్రచారం చేపట్టాల‌ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో మంగళవారం ఆయన మెప్మా రిసోర్స్‌ పర్సన్‌ల‌కు, జానపద కళాకారుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నియంత్రణకు కళాకారులు గ్రామస్థాయిలో కళా ప్రదర్శనలు ఇచ్చి అవగాహన కల్పించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వ‌ల్ల‌ కలిగే ప్రయోజనాల‌ను వివరించాల‌ని కోరారు. ఏడు ల‌క్షల‌ రూపాయల‌తో ...

Read More »

హెల్ప్‌ టు అదర్స్‌ ఆధ్వర్యంలో ఆహార పదార్థాల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద మంగళవారం జాతీయరహదారి మీదుగా నాగ్‌పూర్‌ వైపు నడిచి వెళ్తున్న వల‌స కూలీల‌కు అమెరికాకు చెందిన హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు, మాస్కులు అందజేశారు. అనంతరం ఇందల్వాయి టోల్‌ గేట్‌ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శిబిరం ప్రతినిధుల‌కు వల‌స కూలీల‌కు పంచేందుకు ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్ళు బిస్కట్లు అందజేశారు. ఈ సందర్భంగా హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ ఇండియా ...

Read More »

పురపాల‌క సమావేశం హాలులోనే నిర్వహించాలి

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణానికి చెందిన బీజేపీ కౌన్సిల‌ర్లు బుధవారం కామారెడ్డి పురపాల‌క సంఘానికి సంబంధించి నిర్వహించ తల‌పెట్టిన సర్వ సభ్య సమావేశం టేలి కాన్ఫిరెన్స్‌ ద్వారా కాకుండా ఏదైనా పెద్ద హాలులో సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించాల‌ని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ కౌన్సిల‌ర్‌లు మాట్లాడుతూ కొత్త పురపాల‌క పాల‌క వర్గం ఎన్నుకోబడిన తరువాత ఇంత వరకు ఒక్క సర్వ సభ్య సమావేశం నిర్వహించ లేదని, ...

Read More »

సిఎం మతిభ్రమించి మాట్లాడుతున్నారు…

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అసెంబ్లీ సాక్షిగా పారాసెట్మాల్‌ టాబ్లెట్‌ వేసి కరోనా కట్టడి చేయచ్చు అంటాడా అని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ప్రశ్నించారు. మంగళవారం భిక్కనూరు మండల‌ కేంద్రంలో ఏఎన్‌ఎం నర్సుల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని శాలువాలు కప్పి సన్మానించారు. గర్గుల్‌ గ్రామంలో 7 గ్రామాల‌ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ ...

Read More »