Breaking News

Daily Archives: May 14, 2020

కామారెడ్డి ఆరోగ్య సిబ్బంది పనితీరు భేష్‌

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ వీడియో కాన్పరెన్సు ద్వారా శాఖ కార్యక్రమాల‌ను సమీక్షించారు. కామారెడ్డి జిల్లా ఓ.పి. చూడడం, ఇమ్యునైజేషన్‌ (టీకాలు) లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ఎం.ఓ, ఏఎన్‌ఎం, ఆశా, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని సూచించారు. ఇంతవరకు ...

Read More »

రుద్రూర్‌లో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

వర్ని, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రుద్రుర్‌ గ్రామంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జి మదన్‌మోహన్‌ రావు సేవా (ట్రస్ట్‌) సంఘం సౌజన్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజెన్‌ రసాయనం, సోడియం హైపోక్లోరైడ్‌ పూర్తిస్థాయిలో పిచికారి చేశారు. రుద్రూర్‌ సర్పంచ్‌ ఇందూరు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో రసాయన పిచికారి వాహనాన్ని మదన్‌ మోహన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఇంఛార్జి బాల‌రాజు, కునిపూర్‌ రాజారెడ్డి, ప్రతాప్‌ సింగ్‌, జడ్‌పిటిసి అంబరసింగ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

నిబంధనలు పాటించని దుకాణాల‌పై భారీ జరిమానాలు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నిబంధనలు పాటించని దుకాణాల‌పై అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఎస్‌హెచ్‌ఓ కామారెడ్డి జగదీష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్డిఓ కార్యాల‌యంతో పాటు మూడు లాక్‌డౌన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు సంయుక్తంగా కామారెడ్డి పట్టణంలోని దుకాణాల‌ను తనిఖీ చేసాయి. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించని దుకాణ దారుల‌కు జరిమానాలు విధించాయి. మాస్కు ధరించనందుకు డిఫ్టార్ల నుండి ఐదుగురు సభ్యుల‌ నుండి రూ.3400, 69 దుకాణాల‌ నుండి రూ. 69000, మొత్తం 25 మంది ...

Read More »

నందిపేట్‌ జడ్పిటిసి తెరాసలోకి…

ఆర్మూర్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సమక్షంలో గురువారం నందిపేట్‌ జడ్పీటీసీ యమున ముత్యం తెరాస పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పథకాలు, కేసీఆర్‌ జనరంజక పాల‌న చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో నందిపేట్‌ మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.

Read More »

సహకార బ్యాంకును తనిఖీ చేసిన పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకును డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకు వద్ద పెద్ద సంఖ్యలో కస్టమర్లు గుమిగూడి వుండడంతో బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కస్టమర్లతో మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో గుమిగూడ వద్దని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల‌ని సూచించారు. బ్యాంకులో కలియతిరిగి పరిసరాల‌ను పరిశీలించారు. బ్యాంకు సిబ్బందికి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాల‌ని, డబ్బు లెక్కించే టప్పుడు ...

Read More »

తండ్రిని చంపిన తనయుడు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో గురువారం తండ్రిని కొడుకు నరికి చంపినట్లు భిక్కనూరు ఎస్‌ఐ నవీన్‌ తెలిపారు. గ్రామానికి చెందిన తాటిపల్లి మేల‌య్య (50) ను ఆయన కొడుకు ప్రశాంత్‌ గొడ్డలితో నరికి చంపాడు. తరచూ కుటుంబ సభ్యుల‌తో గొడవ పడేవాడని తిప్పాపూర్‌ గ్రామ విఆర్‌ఓ కమ్మరి రాజేంద్ర ప్రసాద్‌ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు ప్రశాంత్‌ ...

Read More »

వల‌స కార్మికుల‌కు బిజెపి అన్నదానం

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ తరువున కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌ కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండవ రోజు గురువారం అన్నదాన కార్యక్రమం చేశారు. సుమారు 500 మంది వల‌స కార్మికుల‌కు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా రాష్ట్రంలోని వల‌స కార్మికులు వాళ్ళ సొంత రాష్టాల‌కు వెళ్ళే వారి ఆకలి తీర్చాల‌ని బీజేపీ రాష్ట్ర శాఖ ...

Read More »

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు చేసుకుని సిద్ధంగా ఉండాల‌ని సంబంధిత అధికారుల‌కు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌, ఇరిగేషన్‌ అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సాగుకు అనువైన భూమి ఎంత ఉంది, గత సంవత్సరం ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, నీటి ల‌భ్యత ఎంత ఉంది, ప్రాజెక్టు క్రింద నీటి ...

Read More »

శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు

ఎల్లారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ కార్యాల‌యంలో గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే, మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి వైద్య సిబ్బందిచే మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్‌ వ్యాధి పరీక్షలు చేశారు. అదేవిధంగా శానిటేషన్‌ వర్కర్లకు మందులు పంపిణి చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకి కరోనాపై అవగాహనా కల్పించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు ...

Read More »

15న ఏఐసిటియు ఆందోళన

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో కరోన కట్టడి కోసం కొనసాగిస్తున్న లాక్‌ డౌన్ అమలు పరుస్తున్న పాల‌కులు ఉపాధి లేక అవస్థలు పడుతున్న అసంఘటిత, సంఘటిత రంగాల‌ కార్మికులైన నిర్మాణ రంగం కార్మికులు, షాప్‌ ఎంప్లాయిస్‌ కార్మికులు, మున్సిపల్‌, ఆటో కార్మికులు, హమాలి, ఇండ్లలో పనిచేసే పాచిపని కార్మికులు గత మూడు నెల‌లుగా ఉపాధికరువై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిరదని, కార్మికుల‌కు కరోన విపత్తు సహాయం అందించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 ల‌క్షల‌ కోట్లు ...

Read More »

సిఎం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధా..?

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో గురువారం మండలంలోని వివిధ గ్రామాల‌ ఏఎన్‌ఎం, విఆర్‌ఏ, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుల‌కు నిత్యావసర వస్తువుల‌ను మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ మొదల‌వడంతో రైతులు ముందస్తుగానే పంట కోసం సమాయత్తమయ్యారని, సీఎం కేసీఆర్‌ ఇప్పుడు తాను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తానని కొత్త నిబంధన పెట్టడం ...

Read More »

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం శాపురు గ్రామం అంగన్‌వాడి కేంద్రంలో గర్భిణీల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి గురువారం పోషక ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీల‌కు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల‌ని, అత్యవసరంగా బయటికి వెళ్ళాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని ఎంపిటిసి సూచించారు. కార్యక్రమంలో తెరాస ...

Read More »