Breaking News

Daily Archives: May 18, 2020

నిరుపేద ముస్లింల‌కు రంజాన్‌ సామగ్రి పంపిణీ

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కౌన్సిల‌ర్‌, న్యాయవాది సంగీత ఖాందేష్‌ ఆధ్వరంలో పవిత్ర రంజాన్‌ పండుగ పురస్కరించుకొని సోమవారం దాదాపు 60 నిరుపేద ముస్లిం కుటుంబాల‌కు రంజాన్‌ పండుగ గిఫ్ట్‌ పాకెట్స్‌ అందజేశారు. ఈ సందర్బంగా తెరాస నాయకులు ఖాందేష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాజీ ఎంపి కవిత, జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌ సూచనల‌ మేరకు రంజాన్‌ పండుగ సందర్బంగా గిఫ్ట్‌ పాకెట్స్‌ పంపిణీ చేశామన్నారు. తెరాస సీనియర్‌ నాయకులు ఉస్మాన్‌ హజ్రమి మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సందర్బంగా గిఫ్ట్‌ ప్యాకెట్లు ...

Read More »

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, ఎమ్మార్వోలు, రైతు సమన్వయ సభ్యులు తదితరుల‌తో సమీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ పాల‌సీ ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనుగోలు చేయవద్దని, ఒకటి రెండు రోజుల‌లో స్పష్టత వస్తుందని, జిల్లాలో ప్రతి రైతుకు లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు ...

Read More »

వైద్యుల‌ నిర్లక్ష్యంతో పసికందు మృతి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్ల్లా లింగంపేట మండల‌ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం సాయంత్రం ముస్తాపూర్‌కు చెందిన సౌందర్యకు పురిటి నొప్పులు వచ్చాయి. వైద్యుల‌ ఆధ్వర్యంలో ప్రసవం చేయగా ఆడ శిశువు జన్మించింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే పసికందు మృతి చెందింది. విషయం తెలుసుకున్న సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. శిశువు మృతికి వైద్యుల‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

Read More »

రైతుల‌కు చెల్లించిన ప్రతిపైసా రాష్ట్ర ప్రభుత్వానిదే

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌కు అనుగుణంగా కరోనా వైరస్ వ‌ల్ల‌ రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందన్నారు. సోమవారం వరకు 68 వేల‌ 484 మంది రైతుల‌ వద్ద 522 కోట్ల మలువైన ధాన్యం సేకరిస్తే 52 వేల‌ 857 మంది రైతుల‌కు ...

Read More »

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. సోమవారం హైదరాబాద్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యధికంగా విత్తన ఉత్పత్తి చేస్తున్నామని, అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ ఆఫీసర్‌లు, రైతు బంధు సభ్యుల‌ సమన్వయంతో పని చేయాల‌ని, రైతును రాజును చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటను వేయాల‌ని, అప్పుడే రైతు బంధు ...

Read More »

ఆర్మూర్‌లో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోడి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌ స్కీమ్‌ మీద 20 ల‌క్షల‌ కోట్లు మంజూరు చేయడమైనదని, వారికి కృతజ్ఞతగా అభినందనలు తెలుపుతూ దేశాన్ని కాపాడుతున్న గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత ...

Read More »

కాంగ్రెస్‌ నుండి తెరాసలోకి….

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 16 వ వార్డు కౌన్సిల‌ర్‌ చాట్ల వంశీ కృష్ణ, దోమకొండ మండలం ముత్యంపెట్‌ గ్రామ ఎంపిటిసి సభ్యురాలు వెంకటల‌క్ష్మి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వి జి గౌడ్‌ సమక్షంలో తెరాసలో చేరారు. వారికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

నిర్మాణ సామగ్రి ధరలు నియంత్రించాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసిటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాల‌యంలో నిరసన తెలిపి కార్యాల‌లయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు సి హెచ్‌ తిరుపతి, సంఘం కార్యదర్శి ఇ సూర్య వంశి సురేష్‌ మాట్లాడుతూ లాక్‌ టౌన్‌ సందర్భంగా నిర్మాణ రంగం పూర్తిగా తగ్గిపోయిందని దీనికి కారణం నిర్మాణ సామాగ్రి సిమెంటు బస్తాకు కరోనా పేరు చెప్పి వాస్తవ ...

Read More »

పాల‌న గాలికొదిలేశారు…

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో ఆశ వర్కర్లకు, ఏఎన్‌ఎంల‌కు, అదేవిధంగా రామారెడ్డి మండం అన్నారం గ్రామంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లకు నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ చేశారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం ఓవైపు కరోనాతో అల్ల‌కల్లోలంగా ఉంటే కెసిఆర్‌ మాత్రం తన కూతురు కవితకు ఎమ్మెల్సీ సీటు కోసం ఎంపీటీసీలు, కౌన్సిల‌ర్‌ల‌ను ...

Read More »

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌, మేయర్‌ నీతూ కిరణ్‌, అధికారుల‌తో కలిసి పరిశీలించారు. 7వ డివిజన్‌లో 35 ల‌క్షల‌ రూపాయతో (టియుఎఫ్‌ఐడిసి నిధులు) నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల‌ను పరిశీలించారు. తిరుమల‌ టాకీస్‌ చౌరస్తా వద్ద డిసిల్టేషన్‌ పనుల‌ని (మురుగు క్వాలో పూడికతీత) పనుల‌ని పరిశీలించారు. బోధన్‌ రోడ్డులో 60 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మిస్తున్న క‌ల్వ‌ర్టు నిర్మాణ పనుల‌ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ...

Read More »

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద జాతీయరహదారి మీదుగా నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న వల‌స కూలీల‌కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పాటికే అనేక సార్లు ఆహారపదార్ధాలు, వాటర్‌ బాటిళ్ళు, చపాతీలు, బ్రెడ్లు అందజేసిన హెల్ఫ్‌ టు అదర్స్‌ సంస్థ సోమవారం బోజన సదుపాయాలు కల్పించింది. గత 50 రోజుల‌ నుండి దాతల‌ సహకారంతో పేదల‌కు బోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్న ముత్యం నరేష్‌ ద్వారా ...

Read More »

మాచారెడ్డిలో నిత్యవసర సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహామ్మారి వ్యాధి ప్రపంచాన్ని భయానక వాతావరణంలో ముంచుతున్న తరుణంలో చేదోడుగా మేమున్నాం అంటూ నిత్యావసర సరుకుల‌ను ఆశావర్కర్లు, సపాయి సిబ్బంది, ఆటో డ్రైవర్లకు పంపిణి చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, జడ్పీటీసీ మిణుకూరి రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ జీడిపల్లి నర్సింహా రెడ్డి, మండ అధ్యక్షుడు ఆంజినాయక్‌, స్థానిక సర్పంచు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ మండల‌ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌ సిబ్బంది ...

Read More »

గాంధారిలో రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే

గాంధారి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల‌ కేంద్రంలోని ప్రధాన రహదారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల‌ సురేందర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపుగా 90 శాతం రహదారుల‌ పనులు పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే సీతాయిపల్లి, సోమారం గ్రామాల‌ రోడ్లను కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గాంధారి మండల‌ ప్రజలు, గ్రామస్తుల‌ తరఫున సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »