Breaking News

Daily Archives: May 19, 2020

ఆరోగ్య సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు పరచాలి

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆరోగ్య సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలుపరచాల‌ని, గర్భిణీల‌కు రెండవసారి వైద్యపరీక్ష తర్వాత మొదటిసారి కెసిఆర్‌ కిట్‌ పథకం విడుదల‌ చేయటానికి అవసరమైన డాటా పోర్టల్‌లో నమోదు చేయాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సిహెచ్‌సి ఏరియా ఆసుపత్రి సీనియర్‌ సహాయకులు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పర్యవేక్షల‌కు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారుల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో కాన్పులు అయిన ...

Read More »

వల‌స కార్మికుల‌ను పట్టించుకోని ప్రభుత్వాలు

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్టంలో, మరియు, మహారాష్ట్ర, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఢల్లీి, ఇతర రాష్ట్రాల వల‌స కార్మికుల‌ పరిస్తితి చాలా దారుణంగా ఉందని ప్రభుత్వాలు వల‌స కార్మికుల‌ను ఆదుకోవడంలో పూర్తిగా విఫల‌మయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాల‌యంలో జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నాయకులు న‌ల్ల‌ బట్టల‌తో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వల‌స ...

Read More »

ఇంటినుంచి తప్పిపోయిన చిన్నారి

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొడుగుమర్రి గ్రామం మునిప్ప తండాకు చెందిన ముదావత్‌ చందర్‌ కూతురు ముదావత్‌ సంధ్య వయసు 10 సంవత్సరాలు, 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల‌కు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదని కుటుంబీకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే పాపకు కొద్దిగా మతిస్థిమితంలేదని, ఇంట్లో నుండి వెళ్ళినపుడు నలుపు రంగు గౌన్‌ ఉందని, గుండ్రని ముఖం, తెలుపు రంగులో ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పాప ఆచూకీ ...

Read More »

మొక్కల‌ సంరక్షణ చేపట్టాలి

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనులు పెంచాల‌ని, తద్వారా కూలీల‌ సంఖ్యను పెంచాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం జనహితలో మండల‌ అభివృద్ధి అధికారులు, మండల‌ పంచాయతీ అధికారులు, ఎపిఓ, పంచాయతీ సెక్రటరీల‌తో జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల‌ను సమీక్షించారు. ప్రతి ఉపాధి హామీ కూలి రెండు వందల‌ రూపాయలు పైన వచ్చేలా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. చెరువు, ఫీడర్‌ ఛానల్స్‌, కాలువలో పూడికతీత చేపట్టాల‌ని, గ్రామాల‌లో ...

Read More »

అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలునికి రక్తదానం

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం శాబ్ధిపూర్‌ గ్రామానికి చెందిన శ్రీను అనే 17 సంవత్సరాల బాలుడికి అనీమియా వ్యాధితో శరీరంలో రక్తహీనత ఏర్పడిరది. దీంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని సంప్రదించారు. వారికి రక్తదాతల‌ సమూహ సభ్యుడు కిరణ్‌ సహకారంతో కామారెడ్డి పట్టణానికి చెందిన చింతల‌ శ్రీనివాస్‌, లింగాపూర్‌ గ్రామానికి చెందిన బాల‌కృష్ణ సహాయంతో రెండు యూనిట్ల బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ...

Read More »

కష్టకాలంలో పేదల‌ను ఆదుకోవడం సంతోషాన్నిస్తుంది

బాన్సువాడ, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బాన్సువాడ మండలం హన్మాజిపేట గ్రామములో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్న పోచారం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్‌, ఏఎన్‌ఎంలు, పారిశుధ్య కార్మికుల‌కు, పంతుల్లు, సదర్లు, పాస్టర్లకు 25కిలోల‌ బియ్యం, నిత్యావసర సరుకుల‌ను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోన వైరస్‌ చైనాల‌ తయారై నేడు ప్రపంచం మొత్తం పాకీ ...

Read More »

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి రైతు లాభాలు గడిరచేలా చూడాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్‌ అధికారులు, డీల‌ర్స్‌, సమన్వయ సభ్యులు తదితరుల‌తో కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రభుత్వం వ్యవసాయ పాల‌సీ రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నదని, అప్పటి వరకు రైతులు వరి సీడ్‌ కొనుగోలు చేయవద్దని, జిల్లాలో ప్రతి రైతుకు ...

Read More »

హీలింగ్‌ ఫీల్డ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వల‌సకార్మికుల‌కు బస్సు సౌకర్యం

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ నుండి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ వెళ్తున్న వల‌స కార్మికుల‌కు భికనూర్‌ టోల్‌ గేట్‌ వద్ద హీలింగ్‌ ఫీల్డ్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మూడు బస్సులు ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత స్వచ్ఛంద సంస్థను అభినందించి పూల‌మొక్క అందజేశారు.

Read More »