Breaking News

టెక్నో స్కూల్‌ను తరిమి కొడతాం….

కామారెడ్డి, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ కార్పొరేట్‌ పాఠశాల‌ ప్రారంభించకుండానే విద్యార్థుల‌ తల్లిదండ్రుల‌కు, అనేక మందికి పోన్‌ చేస్తున్నారని, పాఠశాల‌కు ఎలాంటి అనుమతి లేకుండానే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, అయినా అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కామారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ప్రతినిధులు అన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జరిగబోయే పరిణామాల‌కు అధికారులే బాద్యత వహించవల‌సి ఉంటుందని హెచ్చరించారు.

కేవలం డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే పాఠశాల‌ ప్రారంభిస్తున్నారని, విద్యార్థుల‌ జీవితాలు ఎమైనా వారికి సంబంధం లేదు, డబ్బు మాత్రమే ముఖ్యమని, తల్లిదండ్రులు గమనించి తమ పిల్ల‌ల‌ను కాపాడుకోవాల‌ని ఏబివిపి నాయకులు తల్లిదండ్రుల‌కు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇటువంటి కార్పొరేట్‌ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందేనన్నారు.

కాబట్టి స్థానిక పాఠశాల‌ల్లో చేర్పించి తమ పిల్ల‌ల‌ చదువుల‌కు బాటలు వేయాల‌న్నారు. రిజిస్ట్రేషన్‌ కాకుండానే ప్రచారం చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఎంతటి దారుణానికి దిగజారుతారని, పాఠశాల‌ మూసివేసేవరకు ఏబివిపి ఉద్యమిస్తుందన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article