Breaking News

Daily Archives: May 22, 2020

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ప్రణాళిక తదితర అంశాల‌పై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా అనంతరం మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కరోనా రహిత జిల్లాగా మారిందని, అత్యవసర సేవల‌ సిబ్బంది, ప్రజాప్రతినిధుల‌ సమన్వయంతో అది సాధ్యమైందని, సహకరించిన అందరికి ...

Read More »

ప్రతి జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం రైతుకు లాభసాటిగా చేయాల‌న్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అగ్రిక‌ల్చ‌ర్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించిందని, అందుకు అవసరమైన స్థల‌ సేకరణకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి రిపోర్ట్‌ సమర్పించాల‌ని జిల్లాలోని రెవెన్యూ అధికారుల‌ను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్‌ల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ కొరకు 600 ...

Read More »

ప్రణాళికా బద్దంగా వ్యవసాయం చేసి లాభాలు గడించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలంలో వ్యవసాయంపై మండల‌ స్థాయి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతు పాత పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తున్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుతో మాట్లాడి, ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేసి లాభాలు గడిరచేలా మార్గదర్శనం చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. రైతు ఒక విజన్‌తో ముందుకు పోవటానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని, ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, వ్యవసాయం లాభసాటిగా ...

Read More »

ఎలుగుబంటి దాడి – ఇద్దరికి గాయాలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌ గ్రామంలోకి శుక్రవారం ఎలుగుబంటి ప్రవేశించింది. ఇద్దరు యువకుల‌పై దాడి చేయగా గాయాల‌య్యాయి. గ్రామస్తులు అప్రమత్తమై కర్రతో ఎలుగుబంటిపై దాడిచేసి కొట్టి బంధించారు. అనంతరం ఎలుగుబంటి దాడిలో గాయపడిన దేమె బాల‌నర్సు, గిద్ద నర్సింలును చికిత్స నిమిత్తం కామారెడ్డి సర్కారు దవాఖానకు తరలించారు.

Read More »

తెరాసలో చేరిన ఎంపిటిసి నిమ్మ శంకర్‌

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రం 1వ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ శంకర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా వేసి టిఆర్‌ఎస్‌లోకి ఎంపీటీసీ శంకర్‌ను గంప గోవర్ధన్‌ ఆహ్వానించారు. ఎంపీటీసీ సభ్యుడు శంకర్‌ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్దే ల‌క్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే బాటలో తాను సైతం ఉంటానన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్‌ కమిటీ ఛైర్మెన్‌ గోపిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ ...

Read More »

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ డివిజన్‌ అదేవిధంగా జోన్ 4 పరిదిలోని బైపాస్‌ రోడ్డులో జరుగుతున్న పారిశుద్ద పనుల‌ను, స్ట్రోమ్‌ డ్రైనేజ్‌ వాటర్‌ పూడికతీత పనుల‌ను శుక్రవారం నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పర్యవేక్షించారు. వ‌ర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడ కుడా నీరు నిలువ‌కుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యల‌ గురించి అధికారుల‌కు సూచనలు చేశారు. ప్రజలు కుడా తడి, పొడి చెత్త వేరుచేసి మున్సిపల్‌ ...

Read More »

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 28వ డివిజన్‌ కార్పొరేటర్ ఇల్లందు మమత ప్రభాకర్‌ తమ డివిజన్‌లో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ మాస్కులు పంపిణీ చేశారు. సుమారు వెయ్యి మాస్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం సామాజిక దూరం పాటించాల‌ని, మాస్కు తప్పకుండా ధరించాల‌ని డివిజన్‌ వాసుల‌కు అవగాహన కల్పించారు.

Read More »

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, వర్షాధార పంటల‌కు అనుకూలం కావడంతో మక్కజొన్న తప్పించి మరే పంట కూడా రాలేని స్థితి ఉందని ఇక్కడి రైతులు అంటున్నారు. రైతులు ఊహించని విధంగా మొక్కజొన్న సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం రైతు వ్యతిరేక చర్యల‌కు నిదర్శనమన్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంట సాగు చేయకపోతే రైతు తమ భూముల‌ను వదులుకొని అప్పుల పాల‌య్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ...

Read More »

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల‌ ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ తేదీన హైదరాబాద్‌ నగరంలో నిర్వహించే తెలంగాణ రత్న పురస్కారాల‌ ప్రదానోత్సవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు యన్‌ డాక్టర్‌ ఇ.ఎస్‌.ఎస్‌ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు, సంగీత, నృత్య, రంగస్థల‌, యోగ, వైద్య, క్రీడాకారుల‌ సేవల‌కు గాను పురస్కారం ప్రదానం చేసి వారిని ప్రోత్సహించాల‌నే ల‌క్ష్యంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆసక్తిగల‌వారు ...

Read More »

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించి ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసిటియు జిల్లా బాధ్యుడు రాజలింగం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కరోనా కట్టడి కోసం గత 70 రోజులుగా విధించిన లాక్‌ డౌన్ వ‌ల్ల‌ దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ కార్మిక వర్గం వేతనాలు రాకా ఉపాధి లేక బిచ్చగాళ్ళుగా మారుతున్నా పట్టించుకోకుండా ...

Read More »