Breaking News

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, వర్షాధార పంటల‌కు అనుకూలం కావడంతో మక్కజొన్న తప్పించి మరే పంట కూడా రాలేని స్థితి ఉందని ఇక్కడి రైతులు అంటున్నారు. రైతులు ఊహించని విధంగా మొక్కజొన్న సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం రైతు వ్యతిరేక చర్యల‌కు నిదర్శనమన్నారు.

ఆయా గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంట సాగు చేయకపోతే రైతు తమ భూముల‌ను వదులుకొని అప్పుల పాల‌య్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తేమ ఏ మాత్రం నిలుపుకోలేని లాటరైట్ నేల‌లు కావడంతో సోయాబీన్‌, పత్తి వంటి పంటలు కూడా వేయలేని పరిస్థితి ఉందని, సీఎం కేసీఆర్‌ మొక్కజొన్న తప్పించి మరే పంటకు అనుకూలంగా ఇలాంటి ప్రాంతాల‌పై పునరాలోచించాల‌ని కోరుతున్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article