Breaking News

రైతు నియంత్రిత వ్యవసాయం వైపు మళ్లేలా చేయాలి

కామారెడ్డి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ అధికారులు నియంత్రిత వ్యవసాయానికి సంబంధించి క్రాప్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ఆర్డిఓ, వ్యవసాయ సహాయ సంచాకులు, తహశీుదారులు, వ్యవసాయ విస్తరణాధికారి నీటిపారుద శాఖ ఇంజనీర్లు, మండల‌ సర్వేయర్లతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన వ్యవసాయ విధానం, క్లస్టర్‌ ఋణమాఫీ, రైతు వేదిక నిర్మాణం, రెవెన్యూ రికార్డు నిర్వహణ తదితర అంశాల‌పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు నియంత్రిత వ్యవసాయం వైపు మళ్లేలా చేయాల‌ని, వర్షాకాంలో మొక్కజొన్న పంట ఎందుకు వద్దు, క్వాలిటీ దిగుబడి ఎందుకు రాదో వ్యవసాయ అధికారులు విడమరచి తెల‌పాల‌ని సూచించారు. మొక్క జొన్న బదులుగా కందులు, పత్తి వేయడం వల‌న దిగుబడి, మార్కెటింగ్‌ తదితర లాభాల‌ను, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కందుల‌ విత్తనాలకు ఇబ్బంది లేదని, కందుల‌కు మార్కెట్లో చాలా డిమాండ్‌ ఉన్నదనే విషయాల‌ను వివరించి, గత వర్షాకాలంలో 88 వేల‌ ఎకరాల‌లో వేసిన మొక్క జొన్న స్థానంలో ప్రస్తుత వానా కాలంలో ఇతర పంటలు వేసేలా ప్రోత్సహించాల‌ని తెలిపారు.

లాభసాటి వ్యవసాయ విధానంలో మార్కెటింగ్‌, అవసరమైన ఆహార ధాన్యాల‌కు అనుగుణంగా పండిరచే పంట విధానం ద్వారా రాబోయే రోజుల్లో రోడ్ల మీద లారీలు నిల‌బడే పరిస్థితి, రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోసే పరిస్థితుల‌ను అధిగమించడం జరుగుతుందని, ఇవే విషయాలు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ సమన్వయంతో రైతుల‌కు వివరించాల‌ని తెలిపారు.

నియోజకవర్గంలో ఏ ఏరియా ఎంత పంట ఉండాల‌నేది నిర్ణయించడం జరిగిందని, వ్యవసాయ అధికారులు నేల‌, నీటి పారుదల‌ పరిస్థితుల‌ను పరిశీలించి అందుకనుగుణంగా అక్కడి రైతుల‌కు ఏ పంట అయితే లాభసాటి అనేది మండల‌, క్లస్టర్‌ స్థాయిలో మైక్రో క్రాప్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల‌ని, వ్యవసాయ అధికారులు తమ విజ్ఞానాన్ని రైతు శ్రేయస్సు కోసం వినియోగించాల‌ని తెలిపారు.

అలాగే క్లస్టర్‌ స్థాయిలో వచ్చే బుధవారం నుండి రైతు సమన్వయ సమితి, మార్కెటింగ్‌, ప్యాక్స్‌, సహకార సంఘాల‌ సభ్యుల‌తో కలిసి రైతుల‌తో సమావేశాలు ఏర్పాటు చేయాల‌ని, ఉత్సాహవంతులు, విద్యావంతులైన రైతుల‌ను భాగస్వామ్యం చేసుకోవాల‌ని తెలిపారు.

రైతు ఋణ మాఫీ వివరాల‌కు సంబంధించి విఆర్‌ఓలు, సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారుల‌కు సహకరించేలా తహసీల్దార్‌లు చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, జిల్లా నీటిపారుదల‌ అధికారి బన్సీలాల్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article