Breaking News

Daily Archives: May 24, 2020

అంబులెన్సులో ప్రసవం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్‌ మండలం బోనాల‌ గ్రామానికి చెందిన, న్యాల‌కంటి కవిత (26) కి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే కవితని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు. 2వ ప్రసవంలో పండంటి మగ బిడ్డ జన్మించింది. తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం దగ్గరలోని లింగంపేట్‌ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 108 ...

Read More »

షబ్బీర్‌ అలీ రూ. ల‌క్ష విరాళం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డిని కలిసి మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్ ల‌క్ష రూపాయల‌ చెక్కు విరాళంగా అందజేశారు. కరోన మహమ్మారి వల‌న ఎంతోమంది వల‌స కూలీలు కాలినడకన వారి రాష్ట్రాల‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఆకలితో అల‌మటిస్తూ ప్రాణాలు వదులుతున్నారని, వారిని కాపాడడానికి తన వంతుగా వల‌స కూలీల‌ ప్రయాణ ఖర్చుల‌ కొరకు ల‌క్ష రూపాయలు అందజేసినట్టు పేర్కొన్నారు.

Read More »

26న బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సమావేశం

బాన్సువాడ, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 26వ తేదీ మంగళవారం తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల‌కు లాభసాటి వ్యవసాయ విధానం- అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్టు డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌.డి.ఓలు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు, డిఏఓ, డీసీఓలు, ఏడిఏలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రాథమిక వ్యవసాయసహకార సంఘాల‌ అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు, ఎంఆర్‌ఓలు, ఎంపీడీవోలు, ...

Read More »

కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు

నిజాంసాగర్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని వాజీద్‌ నగర్‌ గ్రామ ఎంపిటిసి బండికింది సాయిలు, ఉప సర్పంచ్‌ సాయిలు, మాజీ సర్పంచ్‌ గుండె భూమయ్య, తోట సాయిలు, బి.గంగారం, జి.గంగారం, శివరాజు, దేశాయ్‌ రాజు, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే టిఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి తెరాస పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బిచ్కుంద ఎంపిపి ఆశోక్‌ పటేల్‌, జడ్పీటీసీ భారతీ రాజు, తెరాస పార్టీ అధ్యక్షుడు వెంకట్‌ రావు, ఎంపిటిసిల‌ సంఘం ...

Read More »

హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డుకు ఎంపికైన మదన్‌మోహన్‌ రావు

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రావు హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కోవిడ్ – 19 ప్రశంసా అవార్డును అందుకున్నారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. కరోనా కోవిద్‌ 19 వైరస్‌ ప్రబల‌ కుండ ఓజోన్‌, హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తూ, మదన్‌ మోహన్‌ రావు చేస్తున్న ఉద్యోగ ఉపాధి సహాయము, పేద ...

Read More »