Breaking News

అంబులెన్సులో ప్రసవం

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్‌ మండలం బోనాల‌ గ్రామానికి చెందిన, న్యాల‌కంటి కవిత (26) కి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే కవితని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు.

2వ ప్రసవంలో పండంటి మగ బిడ్డ జన్మించింది. తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం దగ్గరలోని లింగంపేట్‌ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- సత్యం, పైట్‌- రామశంకర్‌ను కవిత కుటుంబ సభ్యులు అభినందించారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article