Breaking News

హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డుకు ఎంపికైన మదన్‌మోహన్‌ రావు

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రావు హ్యుమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కోవిడ్ – 19 ప్రశంసా అవార్డును అందుకున్నారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రకటించింది.

కరోనా కోవిద్‌ 19 వైరస్‌ ప్రబల‌ కుండ ఓజోన్‌, హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తూ, మదన్‌ మోహన్‌ రావు చేస్తున్న ఉద్యోగ ఉపాధి సహాయము, పేద ప్రజల‌కు ఆర్థిక సహాయం, ఆకలి చావులు ఆపడానికి నిత్యవసర సరుకుల‌ పంపిణీ, పరిరక్షణ, వల‌స కూలీలు గమ్యస్థానానికి చేరడానికి చేస్తున్న సేవ‌లు వివిధ అంశాల‌పై ఆయన చేసిన పలు సేవల‌కు గానూ అవార్డుకు ఎంపిక చేసినట్టు సంస్థ వెల్ల‌డిరచింది.

ఈ సందర్భంగా మదన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు తనకు రావడం చాలా గర్వంగానూ సంతోషంగాను ఉందన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ద్రావణాన్ని స్ప్రే చేయడానికి అనుమతి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని నారాయణఖేడ్‌లో తమపై కేసులు కూడా పెట్టారని పేర్కొన్నారు.

ఇదేదో రాజకీయ లాభం కోసం కాకుండా ప్రజల ప్రాణాల‌ కోసం వాళ్లు పడుతున్న కష్టాల‌ను చూసి వారికి సేవ చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నానన్నారు. ప్రజల‌కు సేవ చేయడంలో ఎంతో మనశ్శాంతి ఉంటుందని మానవసేవయే మాధవసేవగా ఎన్ని అడ్డంకులు కలిగినా అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల‌కు సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటానని మదన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article