Breaking News

Daily Archives: May 25, 2020

జిల్లాల‌ వారీగా సాగు చేసే పంటల వివరాలు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి సంబంధించి పలు కీల‌క సూచనలు చేసిన విషయం తెలిసిందే. జిల్లా వారీగా చెప్పిన పంటనే వేయాల‌ని ఆయన ఇటీవల‌ ప్రకటించారు. లేకుంటే రైతుబంధు వర్తించదన్నారు. జిల్లా వారీగా ఏఏ పంటలు వేయాల‌న్న దానిపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేశారు. పత్తి పంటను 65 ల‌క్షల‌ ఎకరాల్లో, వరి పంటను 42 ల‌క్షల‌ ఎకరాల్లో, కంది పంటను 12.5 ల‌క్షల‌ ఎకరాల్లో వేయాల‌ని తెలిపారు. 10 ల‌క్షల‌ ...

Read More »

కరోనా నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థన

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ యావత్‌ ముస్లిం ప్రజానీకానికి రెండు చేతులెత్తి దండం పెడుతున్నానని, 30 రోజుల‌ ఉపవాసం ఉండి రంజాన్‌ ప్రార్థనలు చేసి కరోనా మహమ్మారితో నా దేశ ప్రజల‌ను కాపాడాల‌ని దేవునితో ప్రార్థించానని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. సోమవారం రంజాన్‌ సందర్భంగా తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల‌తో మాత్రమే పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. నెల‌ రోజుల‌ నుండి ఉపవాస దీక్షలు పాటించిన ...

Read More »

రైతుల‌పై కొత్త విధానాలు రుద్దడం మంచిదికాదు

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న రైతాంగ విధానం గురించి, పంటల‌ మార్పిడి గురించి రైతు అభిప్రాయాలు తెలుసుకోవటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సోమవారం భిక్కనూరు మండలం జంగంపల్లి, అంతంపల్లి, ల‌క్ష్మి రావుపల్లి, రామేశ్వర్‌ పల్లి, గ్రామాల‌ రైతుల‌తో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ భిక్కనూరు మండలంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండుతాయని, పత్తి పంట ...

Read More »

జంగంపల్లి కృష్ణమందిరం వద్ద అన్నదానం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జంగంపల్లి కృష్ణ మందిరం వద్ద వల‌సకూలీల‌కు, కార్మికుల‌కు, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, ఢల్లీి చత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ వాహనదారుల‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు 600 మందికి డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు గుప్తా అన్నదానం చేశారు. కార్యక్రమములో, పిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌ రెడ్డి, మండల‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌ రెడ్డి, జడ్పీటీసీ ...

Read More »

కామారెడ్డిలో స్వాగత తోరణం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల‌కు వెళ్లే దారిలో నిర్మించనున్న స్వాగత తోరణం పనుల‌ను సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. తోరణం ఆకట్టుకునే విధంగా ఉండాల‌ని, ఇందుకు సంబంధించిన నిర్మాణం నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాల‌ని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో టి.ఆర్‌.ఎస్‌.నాయకులు నిట్టు వేణు గోపాల్‌ రావు, గండ్ర మధుసూదన్‌ రావు, పిప్పిరి వెంకట్‌, నర్సింగరావు, కళాశా ప్రిన్సిపాల్‌ ఎం.చంద్రకాంత్‌, అధ్యాపకులు డా.వి.శంకర్‌, డా.పి.రాజ గంభీర్‌ రావు, ...

Read More »

బావిలో దూకి తల్లీకూతుళ్ల మృతి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ గ్రామంలో సోమవారం తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. గ్రామానికి చెందిన బద్దం లింగమని (40), బద్దం శిరీష (18) లు వ్యవసాయ బావిలో దూకి మృతి చెందగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

గల్ఫ్‌ బాదితుని అభ్యర్థనకు స్పందించిన మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురుని కోల్పోయిన గల్ప్‌ బాధితుని అభ్యర్థనకు మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల కవిత స్పందించారు. ల‌క్సెట్టిపేటలోని స్వగృహంలో జరిగిన సంస్కార కార్యక్రమానికి వెళ్ళి వచ్చేందుకు ముఖ్య కార్యదర్శి ద్వారా అనుమతి ఇప్పించడంతో పాటు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. బాదితుని క్వారంటైన్‌ ఖర్చు కూడా తామే చెల్లిస్తామని కవిత కార్యాల‌య సిబ్బంది తెలిపారు. ఇంటికి చేరడంతో బాధితుడు శ్రీనివాస్‌ కన్నీరు మున్నీరైన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. మంచిర్యాల‌ ...

Read More »

ఉపాధి హామీ పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే మాచారెడ్డి మండలం ఆరేపల్లి, రామారెడ్డి మండలం సింగరాయపల్లి, కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామాలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.

Read More »