Breaking News

Daily Archives: May 27, 2020

రైతు సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు పంటల‌ మార్పిడికి సంబంధించి, రైతు రుణ మాఫీ, వాన కాలం పంట వేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి రైతు బంధు రైతు ఖాతాలో వేయాల‌ని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పంట మార్పిడి చేయమని చెప్తున్న దానిపై ఏమైనా ...

Read More »

రిటైర్డ్‌ ఐఏఎస్‌ఉమాపతి రావు కన్నుమూత

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ వాసి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పలు జిల్లాల‌కు కలెక్టర్‌గా పనిచేసిన కామినేని ఉమాపతి రావు (92) బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. గురువారం దోమకొండలో ఉమాపతి రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమాపతి రావు కొడుకు అనిల్‌ కుమార్‌ కూతురు ఉపాసన సినీ నటులు చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ను పెళ్లి చేసుకున్నారు. పలు జిల్లాల‌కు కలెక్టర్‌గా పనిచేసినపుడు అప్పటి ఎల‌క్ట్రిసిటీ చైర్మన్‌గా పనిచేశారు. తిరుమల‌ ...

Read More »

పాత హాల్‌ టికెట్లతోనే పరీక్షలు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఫలితాలు సాధించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు కొత్త సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. మండలాల‌ వారీగా సమీక్ష నిర్వహించారు. కొత్త సెంటర్లలో ఉన్న విద్యార్థుల‌కు చరవాణి ద్వారా సమాచారం అందించాల‌ని, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాల‌ ఉపాధ్యాయుల‌ను, ప్రధానోపాధ్యాయుల‌ను సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ...

Read More »

నీటి సంరక్షణ పనులు చేపట్టాలి

కామరెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి, గాంధారి మండలం మేడిపల్లిలో ఉపాధి హామీ పనుల‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ బుధవారం పరిశీలించారు. ఉదయం 6 గంటల‌ నుంచి పనుల‌ను ఉదయం 10 గంటల‌ లోపు చేపట్టాల‌ని సూచించారు. ప్రతి కూలికి రెండు వందల‌ పైన గిట్టుబాటు అయ్యే విధంగా అధికారులు చూడాల‌ని కోరారు. నీటి సంరక్షణ పనులు చేపట్టడం వ‌ల్ల‌ భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. కూలీలు భౌతిక ...

Read More »

బాధిత కుటుంబానికి రూ.50 వేలు సహాయం

బాన్సువాడ, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో ఇటీవల‌ గోడ గూలీ ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యుల‌ను రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ రావ్‌ పరామర్శించారు. వారి కుటుంబానికి 25 వేలు, యల‌మంచిలి శ్రీనివాస్‌ రావ్‌ 25 వేలు మొత్తం 50 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. రెండు పడక గదుల‌ ఇళ్ళ విషయంలో వారి మృతికి ...

Read More »

సేంద్రీయ ఎరువుల‌ వాడకాన్ని పెంచుకోవాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటల‌కు దిగుబడి, డిమాండ్‌, మార్కెటింగ్‌, తద్వారా రైతుకు ఆర్థిక లాభాల‌ను చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానం అమలు చేస్తోందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ తెలిపారు. బుధవారం బాన్సువాడ మండలం మైలారం గ్రామంలో వచ్చే వాన కాలంలో పంటల‌ సాగు ప్రణాళికపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంట మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాల‌ని కోరారు. రసాయనిక ఎరువుల‌ వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల‌ ...

Read More »

నిర్భంధ వ్యవసాయం మాకొద్దు…

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల‌ కేంద్రంలో నిర్బంధ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. రైతుల‌కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ఏసి రూములో కూర్చొని రైతు ఏ పంటలు పండించాలో, ఎంత విస్తీర్ణంలో పండించాలో నిర్ణయించడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. తను పండిరచమంటున్న పంటకు మద్దతు ధర మాట ఎత్తని ముఖ్యమంత్రి రైస్ మిల్ల‌ర్లు, విత్తన కంపెనిల‌తో కలిసి రైతుల‌ను నట్టేట ముంచే ...

Read More »

సొంత గూటికి…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 19న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరిన అమ్రాద్‌, మాక్లూర్‌ మండల‌ ఎంపీటీసి కోటగిరి ల‌క్ష్మీ శ్రీనివాస్‌ దంపతులు బుధవారం తిరిగి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. బిజెపి జిల్లా అద్యక్షుడు బస్వా ల‌క్ష్మి నర్సయ్య వారిని పార్టీ కండువాతో ఆహ్వానించారు. సీనియర్‌ నాయకులు యెండల ల‌క్ష్మి నారాయణ, పల్లె గంగా రెడ్డి తదితరులు ఉన్నారు.

Read More »

రైతు కన్నీరు తుడిచేందుకే నూతన సాగు విధానం

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో లాభసాటి వ్యవసాయ విధానంపై జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర రోడ్లు-భవనాు, గృహ నిర్మాణ మరియు శాసన సభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంత్రి సమక్షంలో లాభసాటి వ్యవసాయం చేస్తామంటూ 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేసాయి. మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డికి త్వరలో కాళేశ్వరం జలాలు. మంచిప్ప ద్వారా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల‌కు గోదావరి జలాలు. ...

Read More »

కరోనా బాధితుల‌ను ఆదుకోవాలి

డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరించడానికి వ్యతిరేకంగా బుధవారం ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ ఆనాడు 8 గంటల‌ పని దినాల‌ కోసం కార్మికులు చీకాగోలో ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తిరిగి 12 గంటల‌ పని చేయాల‌ని చెబుతుందన్నారు. ప్రధాని మోదీ కార్మికుల‌కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఉన్న ఉపాధిని తొల‌గించాల‌ని చూస్తున్నారన్నారు. కరోన లాక్ ...

Read More »

ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయంగా రైతు పాలిస్తున్న రాష్ట్రం మనదని, ప్రతిపక్షాల‌ తీరు ఏనుగు పోతే కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం పంట ప్రణాళికపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతుల‌కు కరెంటు కష్టాలు తీర్చిన మహానుభావుడు మన సీఎం కేసీఆర్‌ అని, డిమాండ్‌ ప్రతిపాదన ప్రకారం ఉత్పాదన ఉండాల‌ని కేసీఆర్‌ ప్రణాళిక రచించారన్నారు. సిఎం చెప్పిన ...

Read More »

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ గర్భిణికి ఆర్‌.ఆర్‌ వైద్యశాల‌లో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణంలోని శ్రీనివాస్‌ నగర్ కాల‌నీకి చెందిన ఉప్పల్‌ వాయి జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న గోవర్ధన్‌ రెడ్డి సహకారంతో ఏ పాజిటివ్‌ రక్తాన్ని అందించి ఆపదలో ఉన్న మహిళ ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ఈ ...

Read More »