Breaking News

Daily Archives: May 28, 2020

రాష్ట్రంలో సన్నబియ్యం ఎక్కువ తింటున్నారు

బాన్సువాడ, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం 2020 పంట సాగుపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్‌, పాతవర్ని, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాల‌లో గురువారం జరిగిన ‘‘అవగాహన సదస్సులో’’ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల‌ను ఉద్దేశించి స్పీకర్‌ మాట్లాడుతూ నియంత్రిత పద్ధతిలో ప్రాధాన్యం గల‌ పంటల‌ను సాగు చేయడం ద్వారా రైతులు తమ దిగుబడు నుండి అధిక లాభాల‌ను ఆర్జిస్తారని తెలిపారు. మూస పద్ధతిలో ఒకే రకమైన పంటను ...

Read More »

నాలుగైదు రోజుల్లో ప్రణాళిక ఇస్తాము…

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామంలో గురువారం రైతుకు లాభసాటి వ్యవసాయంపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు నష్ట పోకుండా పండిరచిన పంటల‌ను లాభసాటిగా సకాలంలో విక్రయించుకునేలా చేసేందుకు ఉద్దేశించిందే ఈ కార్యక్రమమని, డిమాండ్‌ లేని పంటలు పండిరచి నష్టపోవడం కంటే, డిమాండ్‌ ఉన్న పంటలు ఆయా ప్రాంతాల‌లోని వాతావరణ పరిస్థితుల‌కు అనుగుణంగా పండిరచేలా రైతుకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందే ...

Read More »

సావర్కర్‌ త్యాగం యువతకు స్ఫూర్తి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌ 137వ జయంతిని గురువారం జిల్లా కోర్టు భవనం వద్ద నిర్వహించారు. సావర్కర్‌ చిత్రపటానికి పూల‌మాల‌లువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరిషత్‌ రాష్ట్రకమిటీ సభ్యుడు న్యాయవాది రాజ్‌కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో కాలాపానీ సజా అనేక సంవత్సరాలు జైలు జీవిడం గడిపి, స్వదేశీ నినాదంతో జాతీయోద్యమంలో కీల‌క పాత్ర వహించారని, ఆయన త్యాగం నేటి యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. ...

Read More »

29న బీర్కూర్‌లో రైతు అవగాహన సదస్సు

బీర్కూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియంత్రిత పంటల‌ సాగుపై శుక్రవారం 29వ తేదీ ఉదయం 9 గంటల‌కు వ్యవసాయ శాఖ అధికారుల‌ ఆధ్వర్యంలో బీర్కూర్‌ మున్నూరు కాపు సంఘము మల్లాపూర్‌ రోడ్డులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్టు మండల‌ వ్యవసాయ శాఖ తెలిపింది. వ్యవసాయ శాఖ ఏఓ కమల‌, ఏఇఓ శ్రావణ్‌ కుమార్‌ మరియు మండల‌ రైతు బంధు సమితి అధ్యక్షతన, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, సహకార సంఘము అధ్యక్ష కార్యదర్శి, మెంబర్స్‌, ఎంపీపీ, ...

Read More »

స్త్రీనిధి రీజనల్‌ మేనేజర్‌గా అనంత కిషోర్‌

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీనిది రీజనల్‌ మేనేజర్‌గా టి. అనంత కిషోర్‌ బాద్యతలు స్వీకరించారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల‌లో రీజినల్‌ మేనేజర్‌గా పనిచేసి బదిలీపై నిజామాబాద్‌ వచ్చారు. అదేవిధంగా స్త్రీనిధి మేనేజర్‌గా డి.వరల‌క్ష్మి మెదక్‌ జిల్లా నుంచి నిజామాబాద్‌ రావడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల‌ నుంచి పి. రాజారావు బదిలీపై వచ్చారు. నిజామాబాద్‌ అర్బన్‌ మేనేజర్‌ మేఘల‌త జిల్లా కలెక్టర్‌ను, డిఆర్‌డివోను మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More »

తెలంగాణ దీపస్తంభం సురవరం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సురవరం ప్రతాపరెడ్డి తెంగాణ దీపస్తంభం అని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ కొనియాడారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా హరిదా రచయితల‌ సంఘం ఆధ్వర్యంలో సుభాష్‌ నగర్‌లోని ట్రెండి క్రియేటివ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూల‌మాల‌ వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాహిత్య వికాసానికి ఆయన చేసిన సేవల‌ను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రచురించిన గోల‌కొండ కవుల‌ చరిత్ర తెలంగాణ సాహిత్య వైభవ శిఖరం అని కొనియాడారు. ...

Read More »

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల మేలు కోసమేనని, రైతుకు దెబ్బ తగల‌నీయమని, కీడు జరుగనీయమని, రైతుకు లాభసాటి అయిన వ్యవసాయాన్ని అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామంత్రి వి. ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గడచిన నాలుగున్నర సంవత్సరాల‌లో ఎవరూ ఊహించని పనులు చేశామని, రెండు సంవత్సరాల‌లో 24 గంటల‌ ఉచిత విద్యుత్‌, 8 వేల‌ నుండి 10 వేల‌ పంట పెట్టుబడి ...

Read More »

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. రామారెడ్డి కి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కారణాల‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తుల‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

తడి, పొడి చెత్త వాహనం ప్రారంభం

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని 47వ వార్డులో తడి, పొడి చెత్త వేరు వేరుగా సేకరించే వాహనాన్ని గురువారం కౌన్సిల‌ర్‌ గెరికంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ప్రారంభించారు. వార్డు ప్రజలు మన కోసం మన ఆరోగ్యం కోసం తడి, పొడి చెత్త వేరు వేరు చేయాల‌ని సూచించారు. రోడ్డుపై గాని, మురికి కాలువల్లో గానీ చెత్త వేయవద్దని, డస్ట్‌ బిన్‌లో ఉంచి వాహనం ఇంటి ముందుకు వచ్చినపుడు మునిసిపల్‌ సిబ్బంది సేకరిస్తారన్నారు. ఒకవేళ రోడ్డుపైగాని, మురికి కాలువల్లో చెత్తవేసే ...

Read More »

పోచారం భాస్కర్‌రెడ్డికి సన్మానం

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్‌ మండలంలోని మోతె గ్రామములో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షత‌న ’’లాభసాటి పంట సాగుపై రైతుకు అవగాహన’’ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. కాగా సొసైటీ చైర్మన్లు, మోతె సర్పంచ్‌ మొట్ట మొదటిసారిగా డిసిసిబి అధ్యక్షుని హోదాలో వారి గ్రామానికి వచ్చినందున భాస్కర్‌రెడ్డికి శాలువతో సన్మానించారు. కార్యక్రమములో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ ...

Read More »

సౌదీలో యజమాని చిత్రహింసలు…

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌కి మాజీ ఎంపీ కవిత ఫోన్‌ చేయడంతో ఎంబసీ అధికారులు, జాగృతి భాద్యుల‌ సహకారంతో అంకమొల్ల‌ రవి పోలీసుల‌ను ఆశ్రయించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మే24 న తీవ్ర గాయాల‌తో అంకమొల్ల‌ రవి సౌదీలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని వీడియో సందేశం పంపాడు. అదే రోజు ఉదయం మాజీ ఎంపి క‌ల్వ‌కుంట్ల కవిత సౌదీ అరేబియాలోని భారత రాయబారి డా.ఔసఫ్‌ సయీద్‌తో మాట్లాడి త్వరగా ...

Read More »

మేము డబ్బుకు అమ్ముడు పోలేదు

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేస్తున్న అభివృద్ధి పనుల‌కు ఆకర్షితుమై పార్టీ మారాము తప్ప డబ్బుకు అమ్ముడు పోలేదని ఎంపిటిసి ఫిరంగి రాజేశ్వర్‌ స్పష్టం చేశారు. గురువారం దోమకొండ తెరాస పార్టీ కార్యాల‌యంలో విలేకరుల‌తో మాట్లాడారు. ఎంఎల్‌సి వొడ్డేపల్లి సుబాష్‌రెడ్డి తమ ఎంపిటిసిపై మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఇతరుల‌ ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకోవాల‌ని హెచ్చరించారు. కార్యక్రమంలో తెరాస మండల ప్రెసిడెంట్‌ ఐరేని నర్సయ్య, ఎంపీటీసీలు నిమ్మ శంకర్‌, ...

Read More »

లారీ ఢీ – యువకునికి తీవ్ర గాయాలు

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరు కార్యాల‌యం సమీపంలోని ఎఫ్‌సిఐ గోదాం వద్ద గురువారం మధ్యాహ్నం లారీ యువకుణ్ణి ఢీకొన్న సంఘటనలో యువకునికి తీవ్ర గాయాల‌య్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎఫ్‌సిఐ గోదాం వద్ద వెనుకకు చూసుకోకుండా లారీని మల‌పడంతో వెనుకనుంచి బైక్‌ పై వస్తున్న యువకుడు లారికి ఢీకొని లారీ కింద పడ్డాడు. గమనించని లారీ డ్రైవర్‌ అలాగే ముందుకు నడపడంతో లారీ టైర్‌ యువకుని పై నుంచి పోయింది. కొన ఊపిరితో ...

Read More »

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ఉన్నదని, తల‌సేమియా వ్యాధితో బాధపడుతున్న వారి గురించి తెలుసుకున్న నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ స్పందించారు. 11వ డివిజన్‌ యువకుల‌ను ప్రోత్సహించి రక్త దానం చేయవసిందిగా కోరారు. కాగా గురువారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో 10 మంది యువకులు రక్త దానం చేశారు. మేయర్‌ కుమార్తె కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయడం అభినందనీయమని ...

Read More »