Breaking News

సావర్కర్‌ త్యాగం యువతకు స్ఫూర్తి

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌ 137వ జయంతిని గురువారం జిల్లా కోర్టు భవనం వద్ద నిర్వహించారు. సావర్కర్‌ చిత్రపటానికి పూల‌మాల‌లువేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పరిషత్‌ రాష్ట్రకమిటీ సభ్యుడు న్యాయవాది రాజ్‌కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో కాలాపానీ సజా అనేక సంవత్సరాలు జైలు జీవిడం గడిపి, స్వదేశీ నినాదంతో జాతీయోద్యమంలో కీల‌క పాత్ర వహించారని, ఆయన త్యాగం నేటి యువతకు స్ఫూర్తి దాయకమన్నారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సావర్కర్ బాల్యం నుంచి దేశభక్తితో కూడిన రచనలు చేసేవారని, ప్రాణాలు లెక్కచేయకుండా జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఉదయ్‌కృష్ణ, జిట్ల రవి, నరేందర్‌రెడ్డి, మానిక్‌రాజ్‌, శశిధర్‌ రెడ్డి, సుదీర్‌, శుభం, గంగారత్నం, గంగారత్నం, శ్రీనివాస్‌ వర్మ, చక్రవర్తి, అనీల్‌ తదితరులున్నారు.

Check Also

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ ...

Comment on the article