Breaking News

Daily Archives: May 29, 2020

జూన్‌ 1 నుండి పల్లె ప్రగతి

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత చర్యలు చాలావరకు తీసుకున్నారని, రాబోయే వానాకాలంలో ఎటువంటి వ్యాధులు ప్రబల‌కుండా జూన్‌ 1వ తేదీ నుండి 8 వరకు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రతి గ్రామంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని తహసిల్దార్‌లు, ఎంపీడీవోల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ ...

Read More »

సదస్సుకు పిలిచారు… అవమాన పరిచారు…

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండల‌ కేంద్రంలో రైతు అవగాహన సదస్సుకు పిలిచి తనను అధికార పార్టీ నాయకులు అవమానపరిచారని కాంగ్రెస్‌ పార్టీ జెడ్పిటిసి ఏలేటి శ్రీల‌త సంతోష్‌ రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లింగం పేట మండల‌ కేంద్రంలో 27వ తేదీన వర్షాకాలం పంట పైన అవగాహన సదస్సుకు తనను ఆహ్వానించి, ప్రోటో కాల్‌ ప్రకారం పిల‌వకుండా తనను చివరగా పిలిచి వేదిక వెనకభాగంలో కూర్చోబెట్టి అవమాన పరిచారని ఆరోపించారు. ...

Read More »

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టినందుకు బాన్సువాడ – పిట్లం రోడ్డుపై తండా వాసులు ధర్నా చేపట్టారు. ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు గతంలో తండాలో వ్యక్తి వద్ద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 3 ల‌క్షలు తీసుకుని మోసం చేశారని అన్నారు. ఈవిషయమై పోలీసుల‌కు పిర్యాదు చేసి రెండు నెల‌లు గడుస్తున్నా స్టేషన్‌ చుట్టూ తిప్పించు కుంటున్నారని సమస్య ...

Read More »

నిరుపయోగంగా ఉన్న బోరుబావులు మూసివేయాలి

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరు బావుల‌ను వెంటనే మూసివేయాల‌ని, ఈ ఆదేశాల‌ను పాటించకుండా ఉండి తమ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత వ్యక్తుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

జూన్‌ 8 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మార్చ్‌, 2020లో నిర్వహించగా మిగిలిన ఎస్‌.ఎస్‌.సి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ను జూన్‌ 8 వ తేదీ నుండి జులై 5 వ తేదీ వరకు 247 సెంటర్లలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన విడుదల‌ చేస్తూ నిర్ణయించిన టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు తమకు కేటాయించిన సెంటర్లలోనే పరీక్షల‌కు హాజరు కావాల‌ని, విధిగా మాస్కులు ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, ...

Read More »

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు అవసరం లేదని, తమ భూమికి అనువైన, తమకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్న పంటను మాత్రమే పండిస్తామని మాచారెడ్డి మండలంలోని మాచారెడ్డి, ప‌ల్వంచ, భావానిపేట్‌ గ్రామాల‌ రైతులు శుక్రవారం తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి నేతృత్వంలో నియంత్రిత వ్యవసాయ విధానంపై మాచారెడ్డి మండలంలో పర్యటించి రైతుల‌తో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారులు, స్థానిక ...

Read More »

మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన మాజీ ఎంపి కవిత

బాన్సువాడ, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నేత అరికెల‌ నర్సారెడ్డి మాతృమూర్తి మృతి పట్ల మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని అరికెల నర్సారెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ ఎంపీ కవిత, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల‌ సురేందర్‌, అరికెల‌ కుటుంబ సభ్యుల‌ను పరామర్శించారు. అరికెల‌ నర్సారెడ్డి తల్లి గంగమ్మ ఈ నెల‌ 19 న మరణించారు. అరికెల‌ నర్సారెడ్డి కుటుంబ సభ్యుల‌కు సంతాపాన్ని వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కవిత, గంగమ్మ ...

Read More »

అంబలి వితరణ

బాన్సువాడ, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాన్సువాడ పట్టణంలో పోచారం భాస్కర్‌ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో పోచారం భాస్కర్‌ రెడ్డి సూచన మేరకు 4వ రోజు ఉచితంగా అంబలి, మంచినీటి పాకెట్లు ప్రజల‌కు పంపిణీ చేశారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీల‌ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ రోజు వారీ పనుల‌ కోసం పట్టణం వచ్చే ప్రజల‌కు ఎండ వ‌ల్ల‌ వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల‌ దాహార్తి తీర్చేందుకు ...

Read More »

భూగర్భ జలాలు పెంపొందించేందుకు పూడికతీత పనులు

నిజాంసాగర్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి. పాటిల్‌ జహీరాబాద్‌ మండలం కొత్తూరు గ్రామంలో నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటి చుక్క నిల్వ‌చేసి భూగర్భ జలాల‌ను పెంపొందించేందుకు నారింజ ప్రాజెక్టు గేట్ల తూము మరమ్మతుతో పాటు పూడికతీత పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. నారింజ ప్రాజెక్టులో నీటిమట్టం ఉంటే జాహీరాబాద్‌లో పుష్కలంగా నీళ్లు ఉంటాయన్నారు. రైతుకు ఉచితంగా పూడికతీత మట్టి అందిస్తామని ...

Read More »

దూపల్లి ఆదర్శగ్రామంగా ముందుకు వెళ్ళాలి

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ విధానం మారాల‌ని, ఎక్కువ డిమాండ్‌ ఉన్న సన్న వరి, పత్తి, సోయా వంటి రకాలు సాగు చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రెంజల్‌ మండలం దూపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన ‘‘లాభసాటి వ్యవసాయంపై అవగాహనా సదస్సు’’లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాల‌ని, కొత్త కొత్త విధానాలు అమలు చేయాల‌న్నారు. ఈ యేడు వానాకాలం నుంచి డిమాండ్‌ ఉన్న ...

Read More »

రక్త హీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ రక్త హీనతతో బాధపడుతుండడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన 8వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ గంప ప్రసాద్‌, సతీష్‌ గౌడ్‌లు రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. బి పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతల‌కు కామారెడ్డి రక్తదాతల‌ సమూహం తరపున ...

Read More »