Breaking News

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టినందుకు బాన్సువాడ – పిట్లం రోడ్డుపై తండా వాసులు ధర్నా చేపట్టారు. ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు గతంలో తండాలో వ్యక్తి వద్ద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 3 ల‌క్షలు తీసుకుని మోసం చేశారని అన్నారు.

ఈవిషయమై పోలీసుల‌కు పిర్యాదు చేసి రెండు నెల‌లు గడుస్తున్నా స్టేషన్‌ చుట్టూ తిప్పించు కుంటున్నారని సమస్య మాత్రం పరిష్కరించడం లేదని ఆరోపించారు. పోలీసుల‌ తీరుకు నిరసనగా తాండాకు చెందిన బాదితుడు డూప్‌ సింగ్‌ క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసులు స్పందించి బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్‌ఐ నచ్చ చెప్పడంతో తండావాసులు ఆందోళన విరమించారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article