Breaking News

సదస్సుకు పిలిచారు… అవమాన పరిచారు…

కామారెడ్డి, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండల‌ కేంద్రంలో రైతు అవగాహన సదస్సుకు పిలిచి తనను అధికార పార్టీ నాయకులు అవమానపరిచారని కాంగ్రెస్‌ పార్టీ జెడ్పిటిసి ఏలేటి శ్రీల‌త సంతోష్‌ రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. లింగం పేట మండల‌ కేంద్రంలో 27వ తేదీన వర్షాకాలం పంట పైన అవగాహన సదస్సుకు తనను ఆహ్వానించి, ప్రోటో కాల్‌ ప్రకారం పిల‌వకుండా తనను చివరగా పిలిచి వేదిక వెనకభాగంలో కూర్చోబెట్టి అవమాన పరిచారని ఆరోపించారు.

అంతేగాకుండా సదస్సులో తనను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారని ఇతర మండలాల‌కు చెందిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాయకులు మాట్లాడటానికి అవకాశం కల్పించారన్నారు. తన అభిప్రాయం తెల‌పడానికి కూడా అవకాశం ఇవ్వలేదని శ్రీల‌త ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారుల‌పై, ఎల్లారెడ్డి శాసనసభ్యునిపై చర్యలు తీసుకోవాల‌ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article