Breaking News

అంబులెన్సులో సుఖ ప్రసవం

కామారెడ్డి, మే 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్‌ రేణుక (26), ఆమెకి పురిటి నొప్పు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది తండాకి చేరుకుని, తక్షణమే రేణుకని హాస్పిటల్‌కు తరలిస్తుండగా పురిటి నొప్పు లు అధికం కావడంతో, మార్గ మధ్యలో అంబులెన్సులో సుఖ ప్రసవం చేశారు.

మూడవ కాన్పు కావడంతో పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల‌ నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో నిర్విరామంగా ప్రజల‌కు సేవలందిస్తూ అంబులెన్సు లో సుఖ ప్రసవం చేసిన 108- అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- శంకర్‌, పైట్‌- రామశంకర్‌ను రేణుక కుటుంబ సభ్యులు అభినందించారు.

Check Also

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు ...

Comment on the article