Breaking News

గంజాయి పట్టివేత

జగిత్యా, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చత్తీస్‌ ఘడ్‌ నుండి అక్రమంగా స్మగ్లింగ్‌ చేస్తున్న నాలుగు కిలోల‌ గంజాయిని సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీ పట్టుకొని ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నుండి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాల‌ సిసిఎస్‌ సిఐ ఆరిఫ్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో వారి సిబ్బంది ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రాయపట్నం చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు.

చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం నుండి వస్తున్న ఒక లారీలో సుమారు 4 కిలోల‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు రాజ్‌ పూథ్‌ జసజీత్‌ సింగ్‌, నవేందర్‌ సింగ్‌, బండి రాజశేఖర్‌ ను విచారణ నిమిత్తం ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

Check Also

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని ...

Comment on the article