Breaking News

కూరగాయలు అమ్ముకోవడానికి ఇన్ని తంటాలా…

కామారెడ్డి, జూన్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిలా కేంద్రంలో కూరగాయల‌ మార్కెట్‌ను గత కొన్ని రోజుల‌ క్రితం డైలీ మార్కెట్‌ నుండి గంజ్‌లోకి మార్చారు. అనంతరం కరొనా నేపథ్యంలో మంగళవారం వరకు క్లాసిక్‌ గోల్డెన్ హాలులో నిర్వహించారు. బుధవారం కరొనా లాక్‌ డౌన్‌ సడలింపుని క్లాసిక్‌ గోల్డెన్‌ యాజమాన్యం తాళం వేశారు. ఇటు గంజ్‌ గేటుకు కూడా తాళం వేయటంతో తాము కూరగాయలు ఎక్కడ అమ్ముకోవాల‌ని బీజేపీ ఆధ్వర్యంలో రైతులు గంజ్‌ గేటు వద్ద గంట సేపు రాస్తారోకో నిర్వహించారు.

అనంతరం ఆర్‌డివో, మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌ వచ్చి గంజ్‌ గేటు తాళాలు తీయించి మార్కెటును గతంలో మాదిరిగా యథాతథంగా నిర్వహించటానికి అనుమతించారు.
ఈ సందర్బంగా బీజేపీ కౌన్సిల‌ర్‌లు మాట్లాడుతూ కామారెడ్డి పరిసర ప్రాంతాల‌ రైతులు ఎంతో కస్టపడి పండిరచిన కూరగాయల‌ను అమ్ముకోవటానికి జాగా కూడా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ అధికారులు రోజుకో దగ్గర అమ్ముకోవాల‌ని ఆదేశిస్తూ వాళ్ళను క్షోభకు గురి చేస్తున్నారని, జిల్లా కేంద్రం అయిన కామారెడ్డిలో గతంలో ట్రాఫిక్‌ను సాకుగా చూపి డైలీ మార్కెట్‌ను గంజికి తరలించారని యిప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నారని మార్కెట్‌కు శాశ్వత పరిష్కారం చూపాల‌ని డిమాండ్‌ చేశారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article