Breaking News

Daily Archives: June 5, 2020

రూ. 2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రాంగంగానగర్‌ గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను, కొల్లూరు గ్రామంలో రూ. 7.50 ల‌క్షల‌తో నూతనంగా నిర్మించిన ఎస్‌సి కమ్యునిటీ హాల్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ ...

Read More »

అభ్యంతరాలు సాయంత్రం 5 గంటల‌లోపు తెల‌పాలి

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ శాఖలో అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల‌ను ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ మెరిట్‌ జాబితా జూన్‌ 6 వ తేదీ శనివారం వ్యవసాయ శాఖ (జె డి ఏ) కార్యాల‌యంలో ప్రదర్శించడం జరుగుతుందని జె డి ఎ గోవింద్‌ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఏవేని సందేహాలు లేదా తేడాలు గమనిస్తే తమ తమ అభ్యంతరాల‌ను అదేరోజు అనగా జూన్‌ 6వ తేదీ సాయంత్రం 5 ...

Read More »

ఎస్‌సి కమ్యూనిటి హాల్‌ ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన ఎస్‌.సి కమ్యూనిటీ హాల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని భూముల‌కు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో మూడు లిఫ్టులు నిర్మించినప్పటికి మంజీరా నదిలో నీరు లేక ఇప్పటివరకు వినియోగంలోనికి రాలేదని, వానాకాలంలో పారే నీటిని ...

Read More »

కరోనా బాధితుడిపై కవిత మమకారం

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రి పాల‌య్యాడు. మొదట గుండెనొప్పి రావడంతో స్నేహితులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో గుండె జబ్బుల‌తో పాటు కరోనా వ్యాధి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన సురేష్‌ రెడ్డి బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి ముగ్గురు పిల్ల‌లు, భార్య కుటుంబ సభ్యుల‌ను నెల‌సరి వేతనంతో పోషిస్తోండగా మార్చి 16న ఆసుపత్రి పాల‌య్యాడు. ఆసుపత్రిలో చేరిన ...

Read More »

ఓట్ల కోసమే ట్రంప్‌ కుట్రలు

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలో న‌ల్ల‌ జాతీయుల‌పై శ్వేత జాతి జాత్యహంకార దాడుల‌కు వ్యతిరేకంగా, డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిని నిరసిస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌరస్తాలో డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల‌ కృష్ణ మాట్లాడుతూ అమెరికాలో న‌ల్ల‌జాతీయుల‌పై శ్వేతజాతీయుల‌ జాత్యహంకార దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం న‌ల్ల‌జాతీయుల‌పై అప్రకటిత వివక్ష, అణిచివేతను ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌ల్ల‌ జాతీయుడు ...

Read More »

పాఠశాలల్లో వసతుల లేమి…

సరిపోని ఇంటర్ నెట్ స్పీడ్… కోవిడ్ తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి విద్యా రంగం సిద్ధంగా ఉందా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా కరోనా తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను పంపేదుకు సాహసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకాల్సిన ఆవసరం ఏర్పడింది. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల వైపు అడుగులు వేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ...

Read More »

ప్రవేశాల‌ కొరకు దరఖాస్తుల‌ గడువు పెంపు

కామరెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ డిఇఇ సెట్ – 2020 లో ప్రవేశాల‌ కొరకు దరఖాస్తును ఈనెల 18వ తేదీ వరకు పొడగించినట్టు కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020-22 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ద్వారా జరుగుతుందని, కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డిఇఇ సెట్‌, డైరెక్టర్‌ ఎస్‌ఐఇటి హైదరాబాద్‌ వారు ఆదేశించినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాల‌కు డిఇఇసెట్‌ వెబ్‌సైట్‌ సందర్శించాల‌న్నారు.

Read More »

భారీగా కారెక్కారు…

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు 500 మంది కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని తెరాస పార్టీ నియోజకవర్గ కార్యాల‌యంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వారిని ఆహ్వానించారు. తెరాస పార్టీలో చేరిన వారిలో ...

Read More »