Breaking News

15 రోజుల వరకు అటవీ ప్రాంతానికి వెళ్ళొద్దు…

కామారెడ్డి, జూన్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం అధికారులు చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. మేకల‌ మందపై ఆదివారం రెండు చిరుతలు దాడి చేసి రెండు మేకల‌ను కొరికి చంపడంతో పాటు మరో మూడు మేకల‌ను తీవ్రంగా గాయ పరిచాయి. మాచారెడ్డి రేంజ్‌ అధికారి కిరణ్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారిని సుజాత తమ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.

గొర్రెల‌, మేకల‌ కాపర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేంజ్‌ అధికారి కిరణ్‌ గ్రామస్తుల‌తో మాట్లాడుతూ 15 రోజుల‌ వరకు పశువులు, గొర్రెల‌, మేకల‌తో అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు. ఎవరి పంట చేల‌ వద్ద వారు మూగ జీవాల‌ను మేపాల‌న్నారు. గ్రామంలో దండోరా వేయించాల‌ని గ్రామ సర్పంచ్‌ గాయత్రికి నోటీస్‌ ఇచ్చారు. వారి వెంట అటవీ శాఖ సిబ్బంది నరేష్‌, అశోక్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article