Breaking News

కరోనా వారియర్స్‌గా జర్నలిస్టుల‌ను గుర్తించి ఆదుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారికి గురై మరణించిన జర్నలిస్టుల‌కు 25 ల‌క్షల‌ ఆర్థిక సహాయం అట్లాగే జర్నలిస్టుందరికీ 10 ల‌క్షల‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయించాల‌ని, జర్నలిస్టు కుటుంబాల‌కు 6 నెలల‌ వరకు ప్రతీ నెల‌ 10 వేలు ఇవ్వాల‌ని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్‌డివో కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు దేవారాం, పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు ఏరియా అధ్యక్షుడు అనిల్‌ కుమార్ మాట్లాడుతు కరోనా వైరస్‌ నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిని గుర్తించి వారి సేవల‌ను అభినందిస్తూ పారితోషకం ఇవ్వడాన్ని హర్షిస్తున్నామని అదే సందర్భంలో జర్నలిస్టుల‌ను విస్మరించడం విచారకరమని అన్నారు.

ప్రజ సమస్యల‌ను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల‌కు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లు, డెస్క్‌ ఎడిటర్‌, సబ్‌ ఎడిటర్లు ఇతర సిబ్బందిని కరోనా వారియర్స్‌గా గుర్తించి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌పై ఉందన్నారు. అట్లాగే పత్రికా, ఎల‌క్ట్రానిక్‌ మీడియా చానల్‌ యాజమాన్యాలు కూడా ఇంత కాలం సిబ్బంది శ్రమ వ‌ల్ల‌నే తమ పత్రికలు, ఛానల్స్‌ నడిచాయని కోట్లు గడిరచారని కానీ విపత్కర కాలంలో జిల్లా ఎడిషన్‌లు తీసేసి మెయిన్‌ ఎడిషన్‌ పేజీలు తగ్గించి సిబ్బందిని దీర్ఘకాలిక సెల‌వులు ఇవ్వడం, తొల‌గించడం, అడ్వర్టయిజ్మెంట్‌ టార్గెట్‌లు పెడుతూ చేయలేకుంటే తొల‌గిస్తున్నారని విమర్శించారు.

జర్నలిస్టు యూనియన్‌లు కూడా ఆ దిశగా యాజమాన్యాల‌పై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌పై పోరాడాల‌ని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐకెఎంఎస్‌ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల‌ గంగారం, రాజన్న, గంగాధర్‌, పివైఎల్‌ నాయకులు మార్ల సతీష్‌, అమితాబ్‌, పిడిఎస్‌యు ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, అబ్రార్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article