Breaking News

ఫోటో మార్చి డబ్బా కొట్టుకుంటున్నారు…

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటల‌కు రాజారెడ్డి కల్యాణమండపంలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి ప్రధాన మంత్రి అయి ఏడాది పూర్తయిన సందర్బంగా కేంద్రప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు వాటి విధి విధానాల‌ గూర్చి ప్రజల‌కు తెలియ చేయడానికి ప్రతి ఇంటికివెళ్ళి చెప్పడానికి కార్యకర్తలు సన్నద్ధం కావాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూచించారు.

మాటలు తప్ప చేతలు లేని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధుల‌తో ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని నిందించడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు లేవని పేర్లు మార్చి, కెసిఆర్‌ ఫొటో వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకుంటుందని అన్నారు.

రేషన్‌ బియ్యం, ఉపాధి హామీ పథకం, పింఛన్లు, వ్యవసాయ మద్దతు ధర, అంగన్‌ వాడి, డబల్‌ బెడ్‌ రూమ్‌, సడక్‌ యోజన, 14 ప్రణాళిక కింద గ్రామాల‌కు నేరుగా నిధులు, ముద్ర రుణాలు, కిసాన్‌ సమ్మన్‌ యోజన కింద ఒక రైతుకు 6 వేలు, విద్య యూనివర్సిటీలు మొన్న కరోన సహాయార్ధం జన్‌ ధన్‌ ఖాతాలు ఉన్న మహిళల‌కు 500, 5 కిలో బియ్యం కిలో కంది పప్పు, ఫుట్‌ పాత్‌ వ్యాపారుల‌కు 10 వేల‌ రుణం, వ్యాపారస్తుల‌కు రుణాలు, పాడి రైతుల‌కు రుణాలు ఇలా మోదీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల‌కు అందుబాటులో ఉంటుందన్నారు.

రెండవ సారి మోదీ ప్రధాని అయ్యాక 370 ఆర్టికల్‌ రద్దు, ట్రిబుల్ తల‌క్ బిల్లు, రామ మందిర నిర్మాణమ్‌, హిందూ శరణార్ధుల‌ కోసం సిఏఏ వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని వాటిని ప్రతి ఇంటికి తీసుకు పోవడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాల‌న్నారు. అనతరం కార్యకర్తల‌చే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article