Breaking News

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

కామారెడ్డి, జూన్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం 3 గంటల‌ సమయంలో సంతాయిపేట్‌ గ్రామానికి చెందిన జంగం శంకరయ్య, చిట్యాల‌ గ్రామానికి చెందిన జంగం భూలక్ష్మి కామారెడ్డి డెంటల్‌ హాస్పిటల్‌ నుండి తిరిగి తమ ఎక్స్‌ఎల్‌ బండిమీద చిట్యాల‌ గ్రామానికి బయల్దేరారు.

తాడ్వాయి గ్రామం దాటినా తరువాత హనుమాన్‌ గుడివద్ద వెనకనుండి బ్లూ కల‌ర్‌ ఎఫ్‌జెడ్‌ బైక్‌ మీద వచ్చిన వారు లక్ష్మి మెడనుండి పుస్తెల‌ తాడు తెంపుకొని పారిపోయారు. బైక్‌ మీద వచ్చిన వారు ఒకరు మెరూన్ కల‌ర్‌ షర్ట్‌ ధరించి వున్నారు. ఒకరు బ్లూ కల‌ర్‌ షర్ట్‌ ధరించి వున్నారని పేర్కొన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article