Breaking News

ఇందూరులో సక్రియమైన సమాజము

నిజామాబాద్‌, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము ఇందూరు అన్ని సమాజాల‌లో కెల్ల‌ సక్రియమైన ఉన్నతమైన సంస్థగా మెగొందుతుందని, కరొనాకాలంలో కూడా అధికారులు సభ్యులు పురోహితులు అందరం కలిసికట్టుగా ఇంటింటా యజ్ఞప్రచారం చేసి దాదాపు 200 కుటుంబాల‌లో ఉచితంగా యజ్ఞసామాగ్రితో హోమం నిర్వహించి వారిని కరోనా నుండి సురక్షితంగా ఉండేటట్లు ప్రయత్నించినట్టు ఆర్యసమాజ సభ్యులు పేర్కొన్నారు.

ఇది ఒక గొప్ప ఉపల‌బ్ధి అని, ఇటువంటి ఎన్నో వివిధ కార్యక్రమాల‌ ద్వారా ప్రజల‌ను చైతనన్యవంతుల‌ను చేస్తున్నామన్నారు. విద్యార్థుల‌ నిర్మాణం, యువకుల‌ నిర్మాణం, పెద్దల‌కు కావల‌సిన ఆరోగ్యం సుఖం, శాంతి, ప్రశాంతమైన జీవనం గడపటానికి సత్సంగం, ప్రవచనం తదితర కార్యక్రమాల‌ నిర్వహణ నిరంతరం కొనసాగుతుందన్నారు. మానవసమాజ శ్రేయస్సే ధ్యేయంగా పరమల‌క్ష్యంగా మహర్షి దయానందుని ఋణం తీర్చుకొనుటకు ఆర్యసమాజము యొక్క అధికారగణం నిరంతరం శ్రమిస్తుందన్నారు.

ఇది గొప్పవిషయమని, అందరికీ ఆదర్శం, అనుసరణీయమన్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ ఆర్యసమాజములో సాప్తాహిక సత్సంగం తిరిగి ప్రారంభించబడుతుందని, ఆదివారం సాయంత్రం 5.30 నుండి యజ్ఞంతో సత్సంగం ప్రారంభమవుతుందని, అందరూ తప్పక హాజరుకావాల‌ని కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article