ఎల్లారెడ్డిలో దుకాణాలు తెరిచి ఉంచే సమయమిదే…

ఎల్లారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని ప్రజలు కరోనా వైరస్‌ భారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇందుకోసం ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని అన్ని రకాల‌ వ్యాపార సముదాయాలు హోటళ్లు, వైన్స్‌ దుకాణములు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, చిన్న చిన్న టీ కొట్టు, టిఫీన్‌ సెంటర్లు, పాన్‌ డబ్బాల‌తో పాటు అన్ని దుకాణ సముదాయముల వారు తమ వ్యాపార సంస్థల‌ను ఉదయం 6 నుంచి తెరిచి సాయంత్రం 5 గంటల‌లోగా మూసివేయాల‌ని విజ్ఞప్తి చేశారు. 17వ తేదీ బుధవారం నుంచి ఇది అమలు పరచాల‌న్నారు. అందరి ఆరోగ్య క్షేమాన్ని కోరుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

Check Also

పుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఎల్లారెడ్డి, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో గురువారం పదవ తరగతి విద్యార్థుల‌కు ...

Comment on the article