Breaking News

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి…

కామారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం అన్ని వ్యాపార సంస్థల‌ ప్రతినిధుల‌తో సమావేశము నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి సమిష్టి నిర్ణయం మేరకు బుధవారం నుండి అన్ని వ్యాపార సంస్థల‌ను ఉదయం 9 గంటల‌నుండి తెరచి సాయంత్రం 4 గంటల‌కు స్వచ్చందంగా అందరూ మూసివేయాల‌ని తీర్మానించారు.

కాబట్టి పట్టణంలోని అన్ని వర్తక వాణిజ్య సంస్థలు ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకటించిన నియమ నిబంధనల‌ను తప్పకుండా పాటించి, ప్రజారోగ్య శ్రేయస్సు దృష్ట్యా భవిష్యత్‌లో కరోనా మహమ్మారి ప్రబల‌కుండా భౌతిక దూరం, మాస్కులు, సానీటైజర్స్‌ తప్పనిసరిగా వాడుతూ కామారెడ్డి పట్టణం నుండి కరోనా తరిమి కొడుదామని అన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article