Breaking News

భావితరాల‌కు చక్కటి వాతావరణం అందించాలి

కామారెడ్డి, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భావితరాల‌కు చక్కటి వాతావరణాన్ని అందించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురువారం తడి, పొడి చెత్త వేరు చేయడం వ‌ల్ల‌ కలిగే లాభాల‌పై గ్రామస్తుల‌కు అవగాహన కల్పించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల‌ని సూచించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొల‌గించి, వర్షపు నీరు గుంతల్లో నిల‌వకుండా చూడాల‌ని కార్యదర్శుల‌ను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల‌ విషయంలో అప్రమత్తంగా ఉండాల‌ని కోరారు. గ్రామాల‌ రూపురేఖలు మార్చడంలో సర్పంచులు, కార్యదర్శులు కీల‌క పాత్ర పోషించాల‌న్నారు. అన్ని గ్రామాల్లో సంపద కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

పల్లె ప్రగతి 10 ప్రమాణాల‌ను పాటించిన గ్రామాల‌ను గుర్తించి ఆదర్శ గ్రామాల‌ను ఎంపిక చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లో పొడి, తడి చెత్త వేరు చేసి సంపద కేంద్రాల‌కు తరలించాల‌ని సూచించారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాల‌ని కోరారు. జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సమన్వయకర్త శంకర్‌, ఎంపీడీవో అనంతరావు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

టేక్రియాల్‌లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు అనేకమంది ...

Comment on the article