Breaking News

చిరు వ్యాపారుల‌కు పదివేలు

కామారెడ్డి, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో నివసిస్తూ సంచార చిరు వ్యాపారం అనగా రోడ్డుపై కూర్చుని మరియు తిరుగుతూ పండ్లు, కూరగాయలు, రొయ్యలు, ఎండు చేపలు, పాలు పోయడం, రోడ్డుపై మాంసం విక్రయించడం, రోడ్డుపై వాహనాలు రిపేర్‌ చేయడం మరియు రోడ్డు పై తిరుగుతూ మరియు కుర్చుని ఏదైనా చిరు వ్యాపారం చేసేవారు ఉంటే వారికి ప్రభుత్వం రూ. 10 వేలు బ్యాంక్‌లోన్‌ ఇప్పిస్తున్నారు.

కావున కామారెడ్డి మున్సిపల్‌ ఆఫీసులోని మెప్మా కార్యాల‌యంలో సంబంధిత అధికారి శ్రీధర్‌ రెడ్డికి సెల్‌ 9494256111 మరియు ఆర్‌పి స్వప్న సెల్‌ 9963224946 కి క్రింద తెలిపిన జిరాక్స్‌ పత్రాలు ఇచ్చి ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల‌న్నారు.

1) అధార్‌ కార్డ్‌ జిరాక్స్‌
2) బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌
3) రేషన్‌ కార్డు పూడ్‌ సెక్యూరిటీ కార్డ్‌ జిరాక్స్‌
4) పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు రెండు
5) వ్యాపారం మరియు పని చేస్తున్న పోటో ఒకటి

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article