Breaking News

9 కిలోమీటర్ల మేర హరితహారం మొక్కలు

కామారెడ్డి, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నె 25న మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో జిల్లా ఉన్నత స్థాయి అధికారుల‌తో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. హరితహారం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి రానున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రధాన రోడ్లకిరువైపులా మొక్కలు నాటాల‌ని సూచించారు.

రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొల‌గించి, గుంతలు తవ్వించాల‌ని కోరారు. పాత హైవే నుంచి హౌసింగ్‌ బోర్డ్ కాల‌నీ, కలెక్టరేట్‌ అప్రోచ్‌ రోడ్డు, కొత్త కలెక్టరేట్‌ ప్రాంతాల్లో మొక్కలు నాటాల‌ని సూచించారు. జిల్లా కేంద్రంలో తొమ్మిదిన్నర కిలోమీటర్లు దూరం పాత హైవేపై మొక్కలు నాటాల‌ని పేర్కొన్నారు. పద్మాజివాడి చౌరస్తా నుంచి బాన్సువాడ వరకు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటాల‌ని కోరారు. అన్ని శాఖల‌ అధికారులు సమన్వయంతో పనిచేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌న్నారు.

ప్రభుత్వ కార్యాయాలు, విద్యుత్‌ ఉప కేంద్రాల‌ వద్ద హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాల‌ని సూచించారు. జిల్లా ఎస్పీ శ్వేత, జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, జిల్లా పరిషత్‌ సీఈఓ చందర్‌ నాయక్‌, ట్రాన్స్‌ కో ఎస్‌ఈ శేషారావు, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, తహసిల్దార్‌ అమీన్‌ సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article