Breaking News

ప్రజల‌కు సౌకర్యంగా టాయిలెట్ల నిర్మాణం

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరమైన ఏర్పాట్లతో కూడిన టాయిలెట్ల డిజైన్లు మరియు రేట్లు ఫైనల్‌ చేసి సర్వీస్‌ మరియు మన్నికను బేరీజు వేస్తూ సోమవారం లోపు ప్రపొసల్స్‌ సమర్పించాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కమిటీ సభ్యుల‌ను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిజామాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించుటకు, టాయిలెట్ల డిజైన్‌ మరియు ఎస్టిమేట్లు తయారు చేయడం కోసం ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ సూపరింటెండిరగ్‌ ఇంజినీర్లతో నియమించిన కమిటీ మరియు మున్సిపల్‌ అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు రకాల‌ డిజైన్లతో (క్యాబిన్‌ టైప్‌, ప్లిర్లతో, ప్లిర్లు లేకుండా) టెండర్లు వచ్చాయని, కమిటీ వాటి డిజైన్లను, క్వాలిటీ, మన్నిక, అవసరమైన సదుపాయాలు, సర్వీసు తదితర అంశాల‌పై పరిశీలించి సోమవారం రిపోర్ట్‌ సమర్పిస్తారని, అనంతరం ఫైనల్‌ చేసిన డిజైన్ల ప్రకారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీల‌లో రోడ్‌ పక్క గుర్తించిన స్థలాల‌లో ప్రజల‌కు సౌకర్యంగా ఉండేవిధంగా టాయిలెట్లను నిర్మించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ ఇ రాజేశ్వర్‌ రెడ్డి, వాటర్‌ గ్రిడ్‌ ఎస్‌ఇ రాజేంద్ర కుమార్‌, మున్సిపల్‌ ఎస్‌ఇ ఆనంద్‌ సాగర్‌, పంచాయతీ రాజ్‌ ఇఇ ఆర్‌. శంకర్‌, ఆర్‌అండ్‌బి ఇఇ రాంబాబు తదితరులున్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article