Breaking News

మత్స్యకారుల‌కు క్రెడిట్‌ కార్డులు

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మత్స్యకారులు పిఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా బ్యాంకు నుండి రుణ సౌకర్యం పొందడానికి ఆసక్తి గల‌వారు జిల్లా బ్యాంకుల‌ను
సంప్రదించి లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాల‌ని ఫిషరీస్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, జిల్లా మత్స్య శాఖ అధికారి యం.రాజారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రిజర్వాయర్ వల‌లు, తెప్పలు కొనుగోలు చేసుకోవడానికి రూ.30 వేలు, మత్స్యకార సంఘాల‌ సభ్యుల‌కు వ్యాపారం చేసుకోవడానికి రూ.25 వేలు, ఆర్‌.ఏ.ఎస్‌ (రి సర్క్యులేటరీ ఆక్వాక్చర్‌ సిస్టమ్‌) పథకం క్రింద రూ. 6 ల‌క్షలు, 10 టన్నుల‌ సామర్థ్యం గల‌ ఐస్‌ ప్లాంట్‌ కోసం రూ. 6 ల‌క్షలు, రోజు 5 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి సామర్థ్యం గల‌ ఫీడ్‌ మిల్‌ కోసం రూ.5 ల‌క్షలు, పెన్ క‌ల్చ‌ర్‌ కోసం రూ. 50 వేలు, కేడ్ క‌ల్చ‌ర్‌ కోసం రూ.1.50 ల‌క్షలు, విత్తన హేచరీల‌కు రూ. 3 ల‌క్షలు, చేపల‌ చెరువుల‌ నిర్వహణ కోసం రూ.2,31,500, అలంకరణ చేపల‌ పెంపకం యూనిట్‌ (అక్వేరియం చేపల‌ పెంపకం) కోసం రూ.1.75 ల‌క్షలు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ రుణాలు పని మూల‌ధనం (వర్కింగ్‌ కేపిటల్‌) కొరకు ఇవ్వడం జరుగుతుందని, తీసుకున్న రుణాలు వాయిదాల‌లో సంబంధిత బ్యాంకుల్లో సకాలంలో చెల్లించవల‌సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు మీ సమీప మత్స్య అభివృద్ధి అధికారి కార్యాల‌యంలోని మత్స్యశాఖ సిబ్బంది వద్ద పొందగల‌రని, ఇతర వివరాల‌ కొరకు 9000368915 మరియు 9542507457 ఫోన్‌ నంబర్‌ ద్వారా సంప్రదించాల‌న్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article