Breaking News

అవార్డు కొరకు దరఖాస్తుల‌ ఆహ్వానం

కామారెడ్డి, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాల‌ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల‌ నుండి 2019 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును మానవ వనరుల‌ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఢల్లీి వారు ఆహ్వానిస్తున్నారు.

ఎంహెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తును ఈనెల‌ 20 నుంచి జూలై 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఎంపిక మార్గదర్శకాల‌ కొరకు ఎంహెచ్‌ఆర్‌డి వెబ్‌సైట్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article