Breaking News

మెటీరియల్‌ తరలించేందుకు రోడ్డు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డులోని కొత్త కలెక్టరేట్‌, డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల‌ని ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్‌ మరియు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు.

శనివారం కొత్త కలెక్టరేట్‌ పక్కన నిర్మాణంలో ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వర్షాకాలం నీరు వచ్చి నిలిచిపోవడం వ‌ల్ల‌ నిర్మాణం చేయలేకపోతున్న విషయాన్ని తెలుసుకొని నీటిని మళ్లించి పక్కనే ఉన్న ఎల్ల‌య్య చెరువులోకి నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.

అలాగే డబల్‌ బెడ్‌ రూం ఇళ్ల స్థలాల‌కు నీరు చేరకుండా బండ్‌ ఏర్పాటు చేయాల‌ని, అక్కడికి మెటీరియల్‌ తరలించేందుకు రోడ్‌ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ రాజేశ్వర్‌ రెడ్డి, ఇఇ రాంబాబు, ఇరిగేషన్‌ మరియు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీర్లు తదితరులున్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article