Breaking News

స్వామీజీ ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల‌ కేంద్రంలోని రాముల‌వారి గుడి వద్ద శ్రీ శాంతానంద తపోవన ఆశ్రమం దారానందగిరి స్వామిజీ అలియాస్‌ దూస సత్తయ్య అలియాస్ ల‌చ్చయ్య సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు గుర్తించారు. దీనికి గల‌ కారణాలు తెలియరాలేదు.

ఉదయం గుడి సిబ్బంది ఆహారం ఇవ్వడానికి పిల‌వడానికి వెళ్లారు. ధ్యానంలో ఉన్నాడని అనుకున్నారు. కాసేపు ఆగి లోపలికి వెళ్ళి చూస్తే ఉరివేసుకున్నట్టు కనబడిరదని మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article