Breaking News

సామాన్యుల‌పై అసాధారణ భారం

కామారెడ్డి, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్ ధరల‌ పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు నియోజకవర్గ ఇంచార్జ్‌లు జుక్కల్‌ సౌదాగర్‌ గంగారాం, బాన్సువాడ కాసుల బాల‌రాజ్‌, ఎల్లారెడ్డి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పెంచిన పెట్రో ధరల‌ను వెనక్కితీసుకోవాల‌ని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు.

కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను అనాలోచితంగా పెంచడం పట్ల నిరసన కార్యక్రమాల్లో పెట్రో ధరల‌ పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల‌పై అసాధారణ భారం మోపినతీరును ఎండగట్టారు. ఇక జూన్‌ 30 నుంచి వారం రోజుల‌ పాటు తాలూకా, బ్లాక్‌ స్ధాయిలో భారీ నిరసనలు చేపడతామని వెల్ల‌డిరచారు. గత 21 రోజులుగా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను పెంచుతూ సామాన్యుల‌పై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన క్రమంలో కేంద్రం పెట్రో ఉత్పత్తుల‌పై ఎక్సైజ్‌ సుంకాలు పెంచి భారీగా దండుకుంటోందని దుయ్యబట్టారు. పెట్రో ధరలు తగ్గినా వాటిపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచి ప్రజల‌కు ఉద్దేశపూర్వకంగానే ఉపశమనం కలిగించడంలేదని ఆరోపించారు.

కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చాట్ల రాజేశ్వర్‌, పట్టణ యువజన అధ్యక్షుడు గడుగు శ్రీనివాస్‌, గూడెం శ్రీనివాస్‌, కౌన్సిల‌ర్లు అంజద్‌, షేరు, శివ, కృష్ణమూర్తి, మాజీ కౌన్సిల‌ర్లు గోనె శీను, జొన్నల‌ నరసింహులు, సర్వర్‌, వలిపిషెట్టి భాస్కర్‌, ల‌క్క పతిని గంగాధర్‌, అహ్మదుల్లా, ఖదీర్‌, అతిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article