Breaking News

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. గురువారం స్థానిక వెల‌మ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ల‌బ్ధిదా‌రుల‌ జాబితాను ఈ నెల‌ 3 లోగా జిల్లా కేంద్రానికి పంపాల‌ని సూచించారు. ఈనెల‌ 10లోగా 20 శాతం రైతుల‌ కల్లాల‌ నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అర్హతగల‌ రైతుల‌కు పంట రుణాలు ఇప్పించాల‌ని తెలిపారు. జిల్లాలో ఎరువుల‌ కొరత లేకుండా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు. రెండు శాఖల‌ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతు కల్లాల‌ నిర్మాణాలు పూర్తిచేయాల‌ని తెలిపారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాల‌ని సూచించారు. గ్రామాల్లో కోతుల‌ ఆహార కేంద్రాల‌ ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించాల‌ని పేర్కొన్నారు.

అడవుల‌ను పునరుద్ధరణ చేయాల‌ని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానికసంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా పరిషత్‌ సీఈఓ చందర్‌ నాయక్‌ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా అటవీ అధికారి వసంత, జిల్లా పంచాయతీ అధికారి నరేష్‌, ఏపీడి సాయన్న, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా ...

Comment on the article